దొంగ అరెస్ట్

బంధువుల ఇంట్లోనే తలదాచుకుంటూ చేసిన అప్పులు తీర్చడం కోసం సదరు బంధువుల ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఒక దొంగను చొప్పదండి పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. సదరు దొంగ వద్దనుండి 5.6 లక్షల నగదు, 1.25 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి కమలాసన్ రెడ్డి కమీషనరేట్ కేంద్రంలోని
దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ హమాలీబస్తీకి చెందిన కుక్కల నవీన్ కుమార్(26) ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు ఇంట్లోనుండి వెళ్ళగొట్టారు. దీంతో అవసరాల కోసం అప్పులు చేసి. అప్పులు తీర్చటంపై ఒత్తిడి పెరగటంతో ఆ నేపధ్యంలో వరుసకు సోదరి అయిన చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన దొబ్బల సుగుణ ఇంటికి తరచూ వస్తూ వెళ్తుండేవాడు. సుగుణ ఎస్ఆర్ఎస్ పి శాఖలో అటెండర్గా పనిచేస్తూ తన తల్లితోనే జీవనం సాగిస్తుంది. సుగుణ జీతం డబ్బులను ఇంట్లో ఉన్న ఇనుప పెట్టెలో దాచిపెడతం గమనించిన నవీన్ కుమార్
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పెట్టెలోని 10.97లక్షల రూపాయల నగదును దోచుకెళ్ళాడు. దొంగిలించిన డబ్బుతో 5.6లక్షలు ఇంట్లో దాసి, మరో రెండు లక్షలు బ్యాంకులో వేసుకొని, లక్ష రూపాయలకు పైగా భార్యకు బంగారు, వెండి నగలు కొనుగోలు చేసి, మిగతా డబ్బును జల్సాలకు ఖర్చు చేశాడు. భాదితురాలు సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత పెట్టె తెరిచి చూడగా దాచిన డబ్బు కనిపించక పోవటంతో గత నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు దొంగ నవీన్ కుమార్ ఈ మధ్య కాలంలో రెండు వాహనాలను కొనుగోలు చేశాడనే సమాచారం అందగానే, అర్నకొండ పరిసర ప్రాంతాలలోనే సంచరిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. బ్యాంకులో దాచిన రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు కూడా బాధితురాలుకి చెందే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు చేధనలో కీలకపాత్ర పోషించిన చొప్పదండి సిఐ టి.లక్ష్మిబాబు, ఎస్.ఐ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్ళు రాజశేఖర్, శ్రీనివాస్ లను కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి టి.అన్నపూర్ణ, ఎసిపి జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
బ్లూకోట్స్ బృందాల పనితీరు బేష్:
కమీషనరేట్ పరిధిలో ఈ మధ్యకాలంలో ప్రారంభించిన బ్లూకోట్స్ బృందాలు ఆశించిన స్ధాయిలో పనిచేస్తున్నాయని పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. బ్లూకోట్స్ బృందాలు ప్రతి గల్లీలోకూడా గస్తీని నిర్వహిస్తుండటంతో నేరాలు
అదుపులోకి రావడంతో పాటు, అక్రమ కార్యకలాపాలు నిరోధించబడ్డాయని తెలిపారు. బ్లూకోట్స్ బృందాలు గస్తీతో పోలీసు విజుబులిటి పెరిగిందని, ప్రజల్లో భద్రత భావం, పెంపొందుతున్నదని పేర్కొన్నారు. బ్లూకోట్స్ బృందాల పనితీరును మరింత
మెరుగుపరిచేందుకు శిక్షణ ఇప్పించనున్నామని తెలిపారు.
రిసెప్షన్ కేంద్రాల ఆధునీకరణ:
కమీషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ లలో రిసెప్షన్ కేంద్రాలను ఆధునీకరించి, ప్రతి అంశాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం జరుగుతుందని కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చే బాధితులకు కనీస మర్యాదనిచ్చి, ఓపికతో వారి విన్నపాలను ఆలకించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చే అన్ని వర్గాల ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన చెప్పారు. పెండింగ్ లో ఉన్న కేసులను చేధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక బృందాలు గాలింపులను కొనసాగిస్తున్నాయని ఆయన తెలిపారు. నేరం జరిగిన తర్వాత పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చేంతవరకు నేరస్ధలాన్ని ఎవరూ ముట్టుకోవద్దని ఆయన కోరారు. నేరస్దలం చిందరవందరగా మారితే ఆధారాలు చెడిపోయే ప్రమాదం ఉందని, తర్వాత నేరాల చేధన కష్టసాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
నగరంలో అదనంగా 70 నూతన సిసి కెమెరాలు:
కరీంనగర్ నగరంలో నూతనంగా మరో 70 సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర్ర డిజిపి నిధులను మంజూరు చేశారని ఆయన వెల్లడించారు. కమీషనరేట్ పరిధిలోని ప్రతి పట్టణ, మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. కమ్యూనిటి సిసి కెమెరాల ఏర్పాటులో చొప్పదండి లో 30 కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగిందని, త్వరలో ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. చొప్పదండి సర్కిల్ పరిధిలోని గంగాధర, రామడుగు మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని, ఇది ఆహ్వనించదగిన పరిణామమని పేర్కొన్నారు. నేరాల చేధన, నియంత్రణకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

money

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.