
-ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు.. -ఢిల్లీలో ఎవరికాళ్లు పట్టుకున్నా నిన్ను వదలం : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు , ఆయన బంధుగణం చేస్తున్న ఫోన్ల ట్యాపింగ్ మా ప్రభుత్వం చేయలేదని చెప్పారు. వైసీపీ వాళ్లను టీడీపీలో చేర్చుకుంటే లేనిది.. మేం టీడీపీవాళ్లను చేర్చుకుంటే తప్పా అని ప్రశ్నించారు.
అసలు రేవంత్ పట్టుబడ్డది.. స్టీఫెన్ తో చంద్రబాబు నిజం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు తాత జేజమ్మ వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు అని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు మోదీ మద్దతిస్తారని తాను అనుకోవడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్లు పట్టుకున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.