దేశానికి పట్టిన శని కాంగ్రెస్సే..

దేశానికి పట్టిన శని కాంగ్రెస్సే నని అన్నారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పై ఆరోపించిన దిగ్విజయ్ సింగ్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చడానికే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని.. పైపుల పరిశ్రమ కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టలేదని తేల్చిచెప్పారు. జలయజ్ఞాన్ని దన యజ్ఞంలా మార్చిన సంస్కృతి మీదని.. తాము పారదర్శకంగా పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వైఖరిని తూర్పార బట్టారు. కమీషన్లు, కుంభకోణాల సంస్కృతి కాంగ్రెస్ దేనని అవినీతి కాంగ్రెస్ కు తమను విమర్శించే హక్కు లేదన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *