దేశానికి అన్నం పెట్టే రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతోనే రైతు బంధు పథకం : ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్

దేశానికి అన్నం పెట్టే రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టారని హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ కొనియాడారు. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పాసుపుస్తకాలు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే రైతుల పక్షాన ఆలోచించి, రైతుకు పెట్టుబడిగా  ఎనిమిదివేల రూపాయలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతు బంధు పథకం దేశంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమమని, గ్రామాల్లోకి వచ్చి రైతులకు పాసుపుస్తకాలు, పెట్టుబడి సహాయ చెక్కులు అందించడం కెసిఆర్  ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడని, రైతుల బాధలను అర్థం చేసుకొని సాదా బైనామాల క్రమబద్ధీకరణ ,భూరికార్డుల ప్రక్షాళన వంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు  కేసీఆర్ చేపట్టారని సతీష్ కుమార్ కొనియాడారు . తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒకప్పుడు పురుగుల మందు  తాగిన రైతు కుటుంబాల్లో పెరుగన్నం తినే రోజులు రావాలనేది కెసిఆర్ ఆకాంక్షలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.  రైతు పక్షపాతిగా ఉన్న కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళల అండగా ఉండాలని సతీష్ కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చెక్‌డ్యాంలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే  దక్కుతుందన్నారు. వ్యవసాయరంగంలో నీటి నిల్వలు పెంచి సంవత్సరానికి కచ్చితంగా రెండు పంటలు పండేందుకు చెక్‌డ్యాంలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి లో శుక్రవారం నాడు పెట్టుబడి సహాయ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు  సతీష్ కుమార్ పంపిణీ చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా రాని పాసు పుస్తకాలను రైతులకు ఇంటి దగ్గరనే అందజేస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని సతీష్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఎరువులు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు .రైతుల్లో రైతు కుటుంబాల్లో చిరునవ్వులు చిందించాలి అనేదే తమ ధ్యేయము అన్నారు. మిషన్ కాకతీయ,  మిషన్ భగీరథ కార్యక్రమాలతోపాటు అన్ని సంక్షేమ పథకాలు శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు .ఎల్లవేళల తమకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను అక్కడి ప్రజలు, రైతులు ఘనంగా సత్కరించారు. మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వారు ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు సతీష్ కుమార్ సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తను కూడా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాల్గొని రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్ పి టి సి సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2018-05-11 at 11.28.28WhatsApp Image 2018-05-11 at 14.18.17WhatsApp Image 2018-05-11 at 14.18.18WhatsApp Image 2018-05-11 at 14.18.19

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *