
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆదాచేయడానికి మరో బృహత్తర పథాకానికి రూపకల్పన చేసింది.. దాదాపు 300 వరకు ధర ఉన్న ప్రస్తుత ఎల్ ఈ డీ బల్బులను గృహ వినియోదారులకు కేవలం 44 రూపాయలకే అందజేసేందుకు డీఈఎల్ పీ పథకంను ప్రవేశపెట్టబోతోంది..
కాగా ఎల్ ఈడీలను తక్కువ ధరకు ఎవరు ఇస్తారో దేశంలో టెండర్ వేయనున్నారు. కేంద్రం అతి తక్కువ ఇచ్చే వారిని నుంచి దేశానికి సరిపడా ఎల్ ఈడీలను కొనుగోలు చేస్తుంది.. వారి ధర పోను మిగతా మొత్తాన్ని సబ్సిడీ కింద కేవలం 44కే వినియోగదారులకు అందజేయనుంది..
ఎల్ ఈడీల వినియోగంతో విద్యుత్ వాడకం దాదాపు 50 నుంచి 90శాతం వరకు ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా ఎల్ ఈడీ బల్బులు వాడితే నలభై వేల కోట్ల విద్యుత్ చార్జీలు తగ్గుతాయి..