దేశంలో జోయాలుక్కాస్ భారీ విస్తరణ ప్రణాళిక

కరీంనగర్ :  అంతర్జాతీయ దిగ్గజం జోయాలుక్కాస్ జ్యూవల్లరీ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాదాపు భారీ విస్తరణకు పూనుకుంది. దేశవ్యాప్తంగా 27 కొత్త షోరూంలని ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ప్రముఖ జ్యూవల్లరీ రీటైల్ చెయిన్స్ కి చేర్చనుంది. కరీంనగర్ (తెలంగాణ),  బెంగళూరు (కర్ణాటక)లలో  తెరిచే మొదటి రెండు షోరూంలలో విస్తరణ ప్రణాళిక ప్రారంభమవుతుంది. కరీంనగర్ శనివారం మేయర్ రవీందర్ సింగ్, డీఎస్పీ రామారావుల చేతుల మీదుగా షోరూం ప్రారంభమైంది. మిగతా ఏప్రిల్ 17న బెంగళూరులో రెండో షోరూం ప్రారంభం కానుంది.

జోయాల్కుకాస్ జ్యూవెల్లరీ ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో 100 షోరూంలకు పైగా విస్తరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ చెయిన్స్ లో ఒకటైన ఈ బ్రాండ్ వివిధ రకాల వ్యాపారాల ఆసక్తులు గల బహుళ-మిలియన్ డాలర్ల అంతర్జాతీయ మిశ్రమం. ప్రపంచపు అతిపెద్ద రీటైల్ చెయిన్ సింగపూర్ , లండన్, యూఏఈ, మలేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్ మరియు భారత దేశాల్లో ఈ సంస్థ విస్తరించి ఉంది.

జోయాలుక్కాస్ లో నాణ్యత , అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రమాణాలకు అనుగుణంగా  నిర్వహిస్తోంది.  100శాతం ఐజీఐ ధృవీకరించిన  వజ్రాలు, బీఐఎస్ హాల్ మార్క్ , బంగారు ఆభరణాలు, ప్లాటినం జ్యూవెల్లరీ మొదలైనవి లభిస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *