
కర్ణాటకలో గౌరీ లంకేష్, త్రిపురలో శంతన్ భౌమిక్, పంజాబ్ లో కెజె. సింగ్ హత్యల పట్ల జర్నలిస్టు నాయకులు దిగ్భ్ర్రాంతిని వ్యక్తం చేశారు. సోమవారం నాడు మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ) బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఫర్ హూమ్ అంశంపై నిర్వహించిన సదస్సులో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు. మన తెలంగాణ దిన పత్రిక ఎడిటర్, ఐజెయు జాతీయ నాయకులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కవి, రచయిత్రి వసంత్ కన్నా భిరాన్, ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె. అమర్ నాధ్ లు ప్రసంగించారు. దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైందని, రోజు రోజుకు క్షీణిస్తున్న జర్నలిస్టుల భద్రత పట్ల వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐజెయు కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, ఎం.ఎ. మజీద్,
తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర్ర అధ్యక్షులు అయిలు రమేష్, హెచ్.యు.జె అధక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శంకర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, యూనియన్ నాయకులు కిరణ్ కుమార్ గౌడ్, ఎ. రాజేష్, వెంకట రెడ్డి, షిరిడి సుధాకర్, అచ్యుత్ రావు తదితరులు పాల్గొన్నారు.