
దేశంలో ప్రజల అభిరుచులు మారాయి.. ఇన్నాళ్లు బైక్ ల మీద పడ్డ జనం మోజు ఇప్పుడు స్కూటర్ ల మీదకు పోయింది.. ఇక టూవీలర్ బైక్ ల యావ పోయింది. ఇప్పుడంతా స్కూటర్ల హవానే .. ఈ స్కూటర్లు ఇంట్లో అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉండడమే దీనికి కారణం.. స్కూటీలతో మగవారితో పాటు ఇంట్లోని మహిళలకు సైతం ఉపయోగపడుతుంది.. ఇంట్లో ఎదిగిన పిల్లలకు సైతం ఈ స్కూటీలు ఉపయోగకరంగా ఉంటాయి.. గేర్లు గట్రా ఉండవు కనుక ఎక్కడైనా వాహనాన్ని సులభంగా తీసుకుపోవచ్చు..
దేశంలో ఇప్పుడు ఎంతో నాణ్యతతో మైలేజీ, ప్రమాణాలతో రిలీజ్ అయిన వాహనం హోండా అక్టివా.. ఇప్పుడు ఈ బైక్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటి అమ్మకాలు దేశంలో రికార్డులు సృష్టిస్తున్నాయి.. ప్రస్తుత ఆర్థిక సహాయంలో అయిదు నెలల్లో 10 లక్షల హోండా యాక్టివా స్కూళ్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.. ఈ ఘనత సాధించిన తొలి వాహనం కూడా యాక్టివానే.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బైక్ లో 51 శాతం యాక్టివా బండ్లే.. మిగతా వాహనాలు ఏవీ కూడా 10 నుంచి 15 శాతం వరకు కూడా అమ్మకాలు లేకపోవడం విశేషం..