
దేశంలోనే సంక్షేమానికి అత్యధికంగా 42వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని గర్వంగా చెప్పవచ్చన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకురావడానికి కొత్త మున్సిపల్, పంచాయితీరాజ్ చట్టాలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫ్రెండ్లీ వాతావరణంలో పనిచేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.