Breaking News

దేశంలోనే పొడవైన గట్టయ్య ఇక లేరు..

File photo of a visitor posing with Gattaiah, who claims to be the tallest man in India, at the arts and crafts centre in the southern Indian city of Hyderabad

భారత దేశంలోనే పొడవైన వ్యక్తిగా పేరొందిన పొడగరి గట్టయ్య (40) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఏడు అడుగుల 6 అంగుళాల పొడవున్న గట్టయ్య నాలుగు రోజులుగా తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 2 గంటలకు కన్నుమూశారు. గుండెపోటు వల్ల మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పూత్నూరు గట్టయ్య స్వగ్రామం.  1975లో జన్మించిన గట్టకు నలుగురు అక్కలు, ముగ్గురు అన్నలు ఉన్నారు.  హర్మోన్ ల ప్రభావంతో గట్టయ్య సాధారణం కంటే ఎక్కువ ఎత్తు పెరిగాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *