Breaking News

దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ పోలీసులు

kcr

హైదరాబాద్ : దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ వసతులు, శాంతిభద్రతల్లో తెలంగాణ పోలీసులు నెంబర్ 1 స్థానంలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని అత్యాదునిక పోలీస్ ట్విన్ టవర్స్ కు కేసీఆర్ ఈరోజు శంకుస్తాపన చేశారు . ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ సింగపూర్, న్యూయార్క్ తర్వాత భారత్ లో హైదరాబాద్ లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. తాను జాతీయస్థాయిలోనే పర్యటించినప్పుడు మీ పోలీస్ వ్యవస్థ బాగుందని నన్ను చాలా మంది పొగిడారని కేసీఆర్ చెప్పారు.

ప్రస్తుతం రూ.320 కోట్లతో అంతర్జాతీయ కమాండ్ కంట్రోల్ రూంకు కేటాయిస్తున్నామని.. వచ్చే ఏడాది బడ్జెట్ లో 700కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పనితీరును మెచ్చుకున్నారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, మంత్రి తలసాని, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *