
తెలంగాణలో అర్చకుల సమ్మెతో దేవుళ్లకు దూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. శ్రావణ మాసంలో ప్రజలు గుళ్లు గోపురాలు తిరుగుతుంటారు. కానీ దేవాలయాల్లో అర్చకులు లేక.. దేవుడిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో భక్తులే మొక్కి ఏదోలా వెళ్లిపోతున్నారు. వారికి తీర్థం , ప్రసాదం పెట్టేవారే కరువయ్యారు..
అర్చకుల సమ్మె కొనసాగుతోంది. తమకు ప్రభుత్వమే జీతాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణలోని ఆలయాలన్నీ అర్చకులు లేక బోసిపోయాయి.. దీప దూప నైవేద్యాలు లేక దేవుడు ఒంటరి అయ్యాడు.