
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉదయం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం దీనిపై ఏపీ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులపై అనుమతి లేదని.. దీనిపై కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేశారు. కాగా సీఎం గురువారం రాత్రి పాలమూరులో ఎత్తిపోతల పథకం ప్రారంభించిన చోటే బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏపీ మంత్రి దేవినేని ఉమ ఓ సన్నాసి. నీ అబ్బ జాగీరారా..’ అంటూ పరుషంగా, ఆవేశంగా ఉగిపోయారు కేసీఆర్.. చంద్రబాబు, దేవినేని మైండిట్ మీ ఆటలు ఇక తెలంగాణలో సాగవ్.. ఇది తెలంగాణ హరిహర బ్రాహ్మాదులు అడ్డు వచ్చినా ప్రాజెక్టు కట్టి తీరుతాం.. మా ప్రజలకు నీళ్లు ఇస్తాం.. అని మండిపడ్డారు.