దేవాదాయ శాఖ బడ్జెట్‌ అంచనాలపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష‌

దేవాదాయ శాఖ బడ్జెట్‌ అంచనాలపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష‌

రూ.250 కోట్ల అంచ‌నా వ్య‌యంగా ప్ర‌తిపాద‌న‌లు

అర్చ‌కుల వేత‌నాలు, ధూప దీప నైవేద్యం, నూత‌న ఆల‌యాల నిర్మాణాల‌కు బ‌డ్జెట్ లో పెద్ద‌పీట‌

ప్రసాదాల మీద జీఎస్టీ విధింపుపై చ‌ర్చ‌

హైదరాబాద్‌: దేవాదాయ‌ శాఖ బడ్జెట్ అంచనాల మీద తెలంగాణ గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2018-19 బడ్జెట్ అంచనాల సమీక్షలో భాగంగా శ‌నివారం స‌చివాల‌యంలో దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారుల‌తో జరిగిన సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఖర్చులు, అంచనాలపై చర్చించారు. ఆల‌య ఉద్యోగులు,అర్చ‌కుల వేత‌నాలు, ధూప దీప నైవేద్యం, నూత‌న ఆల‌యాల నిర్మాణాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగా ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు ఈ సంవత్సరం కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం సుమారు రూ.250 కోట్లు అంచ‌నా వ్య‌యంగా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. కాగా కొత్త‌గా మూడు వేల ఆల‌యాల‌కు ధూప దీప నైవేద్య పథ‌కం వ‌ర్తింపు ప్ర‌క్రియ‌పై పై జిల్లా స్థాయిలో త్వ‌రిత‌గ‌తిన నివేదిక‌ల‌ను సిధ్దం చేసి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కు స‌మ‌ర్పించాల‌ని మంత్రి ఆదేశించారు. మ‌రోవైపు ఆల‌యాల్లో ప్ర‌సాదాల మీద‌ జీఎస్టీ విధించ‌డంపై సంబంధిత అధికారుల‌తో అవ‌గాహ‌న స‌ద‌స్సు ఏర్పాటు చేసి, చ‌ర్చించి ఓ ప‌రిష్కారం చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శివ‌శంక‌ర్, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, ఇంచార్జ్ ఈఎన్సీ ( ఇంజ‌నీర్ ఇన్ చీఫ్) స‌త్యనార‌య‌ణ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *