
హైదరాబాద్, ప్రతినిధి : తెల్లటి దవళవర్ణంతో ధగ ధగ మెరిసిపోతున్న ‘తమన్న’ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. దేవకన్య దివినుంచి భూమికి వచ్చినట్లు ఉన్న పోస్టర్ పిచ్చేక్కిస్తోంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి లో నటిస్తున్న తమన్నా బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా పేరు ‘అవంతిక’. యువరాణి రోల్ చేస్తున్న ఈ బ్యూటీ.. అతిలోక సుందరి మాదిరిగా కనిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.
‘బాహుబలి’ గురించి మరోసారి ఇండస్ర్టీలో చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాష్, రాణా, అనుష్కల పోస్టర్లు రిలీజ్ చేసిన జక్కన్న తాజాగా తమన్నా పాత్రకు సంబంధించి ఓ స్టిల్‌ని రిలీజ్ చేశాడు. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య మాదిరిగా తళతళ మెరిసిపోతోంది. మిల్కీబ్యూటీని దేవతగా డైరెక్టర్ చూపించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే! తండ్రికి జోడీగా అనుష్క నటిస్తుండగా, కొడుకు పాత్రతో తమన్నా కనిపించనుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చేఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.