
ప్రపంచ తెలుగు మహా సభలు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ కొనసాగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ప్రపంచ తెలుగు మహా సభలు మూడవ రోజైన ఆదివారం ఆయన తిలక్ రోడ్, బొగ్గుల కుంట లోని తెలంగాణా సారస్వత సభా భవనం లో నిర్వహించిన శతావధాన కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని వివిధ ఆడిటోరియాలలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతునందుకు సంతోషం కలుగుతుందన్నారు. 42 దేశాలు, 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుండి వచ్చిన అనేకమంది అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. సాహితీ వేత్తలకు, సాహిత్యంలో కృషి చేసిన వారికి మహా సభలు ముగింపు రోజున ఆచరనాత్మకమైన ప్రకటన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్య నేర్పిన పద్దతులు అంకితభావం గల గురువులు అప్పట్లో ఉన్నారని తెలుగు బాష పట్ల మధ్యలో నిర్లిప్తత వచ్చిందని, మళ్ళి ఇపుడు తెలుగు బాష పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు .
నేను పుట్టిన గడ్డకు చెందిన డా. జి.యం. రామశర్మ గారు శతావధానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయంమన్నారు ప్రపంచ తెలుగు మహా సభలకు విచ్చేసిన అతిధులకు సదుపాయాల కల్పనలో ఏలాంటి లోటు పాట్లు లేకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ. యస్. పి. సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తునందున ఈ సందర్భం గా అభినందించారు. శతావధానం చేసి అందరిని మెప్పించ్చిన డా. జి.యం. శర్మ. గారిని సన్మానించారు.
డా. కావూరి పాపయ్య శాస్త్రి సభాధ్యక్షులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అభివృధి సంక్షేమం కార్యక్రమాలపై వివిధ బాష పండితులు అడిగిన వివిధ అంశాలపై శతావధాని డా. జి.యం. రామశర్మ సమగ్రంగా అవదానం చేశారు .
ఈ కార్యకమంలో యం.పి. లు శ్రీ. కేశవరావు, శ్రీ. బాల్క సుమన్, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు శ్రీ. నందిని సిధా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ. రమణాచారి, యం. యల్. సి. శ్రీ. పళ్ళ రాజేశ్వర్ రెడ్డి సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ. వెంకటేశం, పౌర సరఫరాల శాఖ కమీషనర్ సి.వి. ఆనంద్లతోపాటు ముఖ్యమంత్రి గారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువు శ్రీ. మృత్యంజయ శర్మ, సమన్వయ కర్తలు, తెలుగు బాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.