దెబ్బకు ఠా.. టీడీపీ ముఠా..

kcr tdp copy

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముందు ముచ్చట.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ సీఎం చంద్రబాబుతో మీటయ్యారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ను కడిగేయాలని.. టీఆర్ఎస్ కంటే టీడీపీ ప్రభుత్వమే బాగా చేస్తోందంటూ ప్రచారం జరగాలంటే మీరు అసెంబ్లీని గడగడలాడించాలి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని ఆదేశించారు చంద్రబాబు గారూ..

తీరా బడ్జెట్ సమావేశాల తొలిరోజే రెచ్చిపోయారు టీడీపీ ఎమ్మెల్యేలు.. గవర్నర్ మీద చిత్తు కాగితాలు విసిరారు. జాతీయ గీతాన్ని అవమానపరిచారు. తాము అసెంబ్లీలో హీరోలం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

సీఎం కేసీఆర్ టీడీపీ ముఠాకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. టీడీపీ అసెంబ్లీలో చేసిన బీభత్సానికి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పాల్గొనకుండా నిషేధం విధించారు. నెలరోజులు సతాయిస్తారనుకున్న టీడీపీ ని ఒకేరోజులో గవర్నర్, జాతీయగీతం ఈ రెండు విషయాలను సాకుచూపి ఏకంగా ఈ బడ్జెట్ సమావేశాలకే దూరం పెట్టారు సీఎం కేసీఆర్.. దీంతో చంద్రబాబు ప్లానింగ్, దిశానిర్దేశం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఏదో చేస్తారనకుంటే ఏదో అయిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పడు టీఆర్ఎస్ కొట్టిన దెబ్బకు ఠారెత్తిపోయారు. ఏం చేయాలో పాలుపోక ధర్నాలకు పరిమితమైపోయారు. ఈ తతంగం మొత్తంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేసిన కేసీఆర్ కర్ర విరగకుండా పాము (టీడీపీ)ని చావబాదారు. మొత్తానికి చంద్రబాబుకు అదిరిపోయే ట్రీట్ మెంట్ ఇచ్చారు కేసీఆర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *