
Censor : u
Duration: 158 mn
Rating : 2/5
Banner : సురేష్ ప్రొడక్షన్స్
Casting: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
Cinematography : ఎస్ గోపాల్ రెడ్డి
Music :శరత్
Editor:మార్తాండ్ వెంకటేశ్
Story :జీతూ జోసెఫ్
Producers: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
Director : శ్రీ ప్రియ
Released Date : 11- 07-2014
Introduction : రీమేక్ సినిమా లతో వరుస హిట్స్ సాధించిన హీరో విక్టరీ వెంకటేష్… వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతూ.. హీరో గా కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో మళ్ళీ ఓ మలయాళ రీమేక్ ని నమ్ముకున్నాడు. ఈ సారి హీరోయిజం కంటే బలమైన కథ తో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని ‘దృశ్యం’ సినిమా తో థియేటర్ లకు వచ్చాడు. రిలీజ్ టైం దగ్గర పడినా పెద్దగా హైప్ రాలేదని థింక్ చేసిన బిజినెస్ బ్రెయిన్ దగ్గుబాటి సురేష్ బాబు రిలీజ్ కు ముందే పాజిటివ్ రివ్యూస్ వచ్చేలా ప్లాన్ చేశాడు. సినిమా స్లో గా ఉందని ప్రేక్షకులు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం ప్రొడ్యూసర్స్ కి ఉన్నట్టుంది. మలయాళం ప్రేక్షకులను మెప్పించిన సినిమా తెలుగు వాళ్ళను మెప్పించడం లో ఫెయిల్ అయితే అది మేకర్స్ లోపమే.
Plot: కేబుల్ టివి వ్యాపారం చేసుకుంటూ కుటుంబమే సర్వస్వం అనుకుని బ్రతికే రాంబాబు. భార్య , ఇద్దరు కూతుళ్ళతో హ్యాపీ గా బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి ఇంటికి… కూతురి జీవితాన్ని … ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని నాశనం చేయటానికి ఓ అతిధి… ఒక రాత్రి టైం లో వస్తాడు. కుటుంబాన్ని లైఫ్ అండ్ డెత్… అనే పరిస్తితి లో రాంబాబు ఫ్యామిలీ మెంబెర్స్… ఆవేశం లో ఒక స్టెప్ తీసుకుంటారు. ఆ స్టెప్ తో ఆ ఫ్యామిలీ ఇంకా గోతిలో పడుతుంది. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్న రాంబాబు ….. ఆకలి, అవసరం అన్నీ నేర్పిస్తాయి … అన్న నానుడిని నిజం చేస్తూ తన సినిమా తెలివి తేటలతో తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఐ. జి. తో పేస్ తో పేస్ తలపడాల్సి వస్తుంది. రాంబాబు ఫ్యామిలీ వలన నష్టపోయిన ఐ. జి. రివేంజ్ తీర్చుకుందా… ? గెలుపు … ఓటమి ఎవరిది అనేది కథ. పిల్లల పెంపకం గురించి అంతర్లీనం గా ఓ మెసేజ్ కూడా ఉంది.
Technical : మొదట గా ఈ సినిమా స్టొరీ రైటర్ ని మెచ్చుకోవాలి. చాలా మంచి కథ. ట్విస్ట్ లు కూడా చాలా బాగున్నాయి. రెండున్నర గంటలు థియేటర్ లో కూర్చో బెట్టె సత్తా ఈ కథకు ఉంది. సీన్స్ మాత్రం … ప్రత్యేకంగా కామెడీ కోసం ఉన్న నాలుగు సీన్స్ ఇంకా చాలా బాగా వర్క్ చేసి ఉండాల్సింది. కెమెరా జస్ట్ ఓకే. ప్రొడ్యూసర్స్ అస్సలు కర్చు పెట్టలేదు. సురేష్ బాబు ఎఫెక్ట్ ఏమో. ఎడిటింగ్ కూడా ఇంకా చాలా చేయొచ్చు. పరుచూరి బ్రదర్స్ వర్క్ ఏం చేశారో తెలీదు. డైరెక్షన్ చాలా వీక్ గా ఉంది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి పాస్ మార్కులే.
Highlights : కథ
చిన్న పిల్లల యాక్టింగ్
వెంకటేష్, నరేష్, నదియా
Drawbacks : కొన్ని సీన్స్
డైరెక్షన్
ఎడిటింగ్
స్క్రీన్ ప్లే (ఓకే… బట్ ఇంకా బెటర్ చెయ్యాలి)
మ్యూజిక్
Bottom Line : తెలుగు ప్రేక్షకులను తప్పు పట్టటం కంటే తీత పైన ఇంకొంచెం శ్రద్ధ పెడితే దృశ్యం లాంటి సినిమాలు మెప్పిస్తాయి…