Breaking News

దుబాయ్ లో డబ్బుల వర్షం

rain money in dubai

దుబాయ్ లో డబ్బుల వర్షం కురిసింది. ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు కానీ.. ఐదువందల దిర్హం నోట్లు వర్షం పడ్డట్టే వెల్లువలా వచ్చి రోడ్లపై పడ్డాయి. హోరెత్తుతున్న గాలితో పాటు కొట్టుకుంటూ రోడ్లమీదకు వచ్చిపడ్డాయి. డబ్బులు వెల్లువలా రావడాన్ని చూసిన జనం రోడ్లమీదకు వచ్చి వాటిని ఏరుకున్నారు. దీంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

సుమారు పది లక్షల పౌండ్ల  విలువైన క్యాష్ ఇలా రోడ్డు మీద కు వచ్చిపడింది. ఇటీవల దుబాయ్ ఇసుక తుఫాన్ లు తరుచుగా వస్తున్నాయి.  అయితే అధికారులు ఓ ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వెళ్తుండగా ఇసుక తుఫాన్ వల్ల కొన్ని ఇలా గాల్లో కొట్టుకుపోయాయని.. అవే ఇలా ఆకాశం నుంచి పడ్డాయని అధికారులు తెలిపారు. కాగా రికవరీ కష్టం అని తేల్చారు. కరెన్సీ నోట్లు ఎక్కడెక్కడికి పోయారో.. ఎవరు తీశారో తెలియదని అధికారులు చెప్పారు. దొరికినోళ్లకు మాత్రం పండగే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *