దున్నేస్తానన్నారు.. పొగిడేశాడు..

-రామోజీ ఫిల్మ్ సిటీలో కేసీఆర్, రామోజీ ఏకాంత చర్చలు
హైదరాబాద్ , ప్రతినిధి : ‘అధికారంలోకి వస్తే అప్పనంగా రైతుల భూముల్ని కబ్జా చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ ని వేయి నాగళ్లతో దున్నేస్తా..’ ఇది కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు.. కానీ ఇప్పుడు కేసీఆరే అధికారంలో వచ్చారు. వేయినాగళ్లు కాదు కదా.. ఒక్క నాగలిని కూడా కూడా కేసీఆర్ ప్రయోగించలేదు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆవేశంలో కేసీఆర్ ఏదైనా చేస్తాడేమోనని ఈనాడు ఎండీ రామోజీ కొడుకు కిరణ్ కేసీఆర్ ను ఇంటికెళ్లి కలిశాడట.. అప్పుడు ఏం జరిగిందో తెలియదు.. ఆ తర్వాత రామోజీ రావు కూడా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ అడిగాడట.. అప్పడు కేసీఆర్ బిజీ గా ఉండి ఆర్నెళ్లుగా ఆయనకు మొహం చాటేశాడు…

మరి ఇప్పడు ఒక్కసారిగా సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఫిలింసిటీకి చేరుకున్నారు.. అక్కడే రామోజీతో కలిసి లంచ్ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో రామోజీ తనయుడు కిరణ్, శైలజ కిరణ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని చూసి రామోజీరావును తెగ పొగిడేశాడు.. రామోజీ కూడా గేట్ దగ్గర్నుంచి అన్నీ తానై కేసీఆర్ సపర్యలు చేశాడట.. ఇదంతా తెలిసిన పాత ఉద్యమకారులు నోరెళ్ల బెడుతున్నారు.. ‘దున్నేస్తానన్న కేసీఆర్..’ రామోజీని ఇంతలా పొగడడం వెనుక మర్మమేంటోనని ఆని గుసగుసలాడుకుంటున్నారు..

రామోజీ కొత్తగా ప్రారంభించతలపెట్టిన ఓం ప్రాజెక్టుపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తాజా రాజకీయ పరిణామాలు వీళ్ల భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. భేటీ అనంతరం రామోజీ తన కుటుంబసభ్యులైన కొడుకు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లని అందరినీ పేరుపేరునా కేసీఆర్‌కి పరిచయం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ వెళ్లి రామోజీతో స్వయంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతని సంతరించుకుంది.

అయినా ఉద్యమ సమయంలో ఉన్న వేడి ఇప్పడుండదూ కదా.. ఎవరి ‘ఆర్థిక’ ప్రయోజనాలు వారివి. అందుకే ఇలా ‘రావులు.. రావులు..’ కలిశారని చర్చించుకుంటున్నారు. తెలంగాణకే తలమానికంగా ఫిల్మ్ సిటీని నిర్మించాడని కేసీఆర్ అంటే.. సమర్థ పాలకుడంటూ రామోజీ పొగిడేశాడట.. మొత్తానికే పాత రావుల కొత్త పరిచయం ఏ స్వ ప్రయోజనం కోసమేనని అంతా అనుకుంటున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.