దీపావ‌ళి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` ఫ‌స్ట్‌లుక్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. బాస్ ఈజ్ బ్యాక్ .. అందుకు త‌గ్గ‌ట్టే బాస్ అస‌లైన లుక్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో మ‌రింత పెరిగింది. యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మెగాస్టార్ స్ట్రెయిట్‌ లుక్.. మ్యాన‌రిజ‌మ్స్‌ని ఆవిష్క‌రించే కొత్త‌ స్టిల్స్‌ చూడాల‌న్న ఆస‌క్తిని ఫ్యాన్స్‌ క‌న‌బ‌రిచారు. అందుకే ఈ దీపావ‌ళి కానుక‌గా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌ను నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ లాంచ్ చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో మెగాస్టార్ లుక్ సూపర్భ్ అన్న టాక్ వ‌చ్చింది. త‌న‌దైన స్టైల్లో ష‌ర్ట్ మ‌డ‌త పెడుతూ బాస్ ఓ స్టిల్‌లో గ్యాంగ్‌లీడ‌ర్‌ని త‌ల‌పించారు. వేరొక స్టిల్‌లో త‌న‌కు మాత్ర‌మే సాధ్యం అనిపించే డ్యాన్స్ మూవ్‌మెంట్‌ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -“ఖైదీ నంబ‌ర్ 150 .. మెజారిటీ పార్ట్‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సోమ‌వారం నుంచి ప‌తాక స‌న్నివేశాల చిత్రీకరిస్తాం. సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర పనులు పూర్తి చేస్తున్నాం. త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు యూనిట్‌ విదేశాలు వెళుతోంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. దీపావ‌ళి కానుక‌గా అభిమానుల ముందుకు కొత్త పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది“ అన్నారు.

ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట‌త‌ర‌ణి క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.