
పాపం సిరియా బాధితులు.. దేశంలో ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల వల్ల చావడం ఇష్టం లేక పొట్ట చేతబట్టుకొని పొరుగునే ఉన్న హంగరీ దేశానికి వలస వెళ్లారు. అక్కడ బార్డర్ లో పోలీసులు దయచూపి దేశంలోని విడిచిపెట్టగానే బతుకుజీవుడా అంటూ పరుగెత్తి హంగరీలోకి పిల్లపాపలతో పరిగెత్తారు.
అక్కడే రాక్షసిలాగా ఉన్న ఓ హంగరీ ఫొటో గ్రాఫర్ నియోనాజీ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది. వీడియో తీసుకోవాల్సిన ఆమె శరణార్థులను తంతూ కింద పడేస్తూ వీడియో తీస్తూ రాక్షసానందం పొందింది. ఈ వీడియోను మిగతా కెమెరామెన్లు తీసి ప్రసారం చేశారు. దీంతో సదురు చానెల్ వాళ్లు ఘనకార్యం చేశావంటూ ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు.
కూడు గూడు లేక వస్తున్న శరణార్థులను ఆదుకోవాల్సిన మంచి మనసు ఉండాల్సిన ఆమె చేసిన ఈ పని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు గురిచేసింది..