దివ్యాంగుల శిక్షణ, ఉపాధికి ప్రత్యేక కార్యక్రమాలు: మంత్రి కెటి రామారావు

దివ్యాంగుల ఉపాది కల్పన, శిక్షణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ, ఉద్యోగాలు కల్పించే సంస్దలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తామన్నారు. ముఖ్యంగా వరంగల్ లాంటి ద్వీతీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి, ఉపాది కల్పిస్తే పలు ప్రోత్సాహాకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అందరితో పాటు సమానంగా అవకాశాలిస్తే చాలన్నారు. దివ్యాంగుల విషయంలో వివక్ష చాల రూపాల్లో ఉందని, ఇలాంటి వివక్ష తగ్గించేలా తాము పనిచేస్తామన్నారు. దివ్యాంగుల కోసం శిక్షణ ఇచ్చి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలకు సిద్దంగా తయారు చేస్తే దివ్యాంగులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అనేక ఐటి కంపెనీలు రేడిగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాల రంగాలు, పాలసీలు, పథకాల్లో ఇతర రాష్ర్టాలకు అదర్శంగా ఉన్నామని, ఇప్పుడు ఈ దివ్యాంగుల ఉపాది కోసం సైతం ప్రత్యేకమైన విధానాలు రూపొందిస్తామన్నారు. దివ్యాంగుల శిక్షణ కోసం టాస్క్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడతామన్నారు.

దివ్యాంగులకు మాత్రమే పెద్ద పీట వేస్తు ఉద్యోగాలు కల్పించే వింద్యా ఈ ఇన్పో మీడియా కాల్ సెంటర్‌ను ఈ రోజు బేగంపేటలో మంత్రి ప్రారంభించారు. బెంగళూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్ధ తాజాగా హైదరాబాద్ కు విస్తరించింది. కేవలం దివ్యాంగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించే ఈ సంస్ధ వారీకోసం ప్రత్యేకంగా శిక్షణ సైతం కల్పిస్తుంది. ఈ కంపెనీ ప్రాంగణాన్ని ప్రారంభించింన మంత్రి, అక్కడ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారీతో ముచ్చటించారు. వారు పనిచేస్తున్న తీరుని పరిశీలించిన మంత్రి దివ్యాంగులు ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్నారన్నారు. రెండు రోజుల శిక్షణ అనంత ఇక్కడ ఉద్యోగం పొందిన బిటెక్ యువతి సుల్తానా చెప్పిన సమాధానం పట్ల మంత్రి అశ్చర్యం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఏం కావాలని అడిగినప్పుడు, శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తే చాలని చేప్పింది, కానీ దివ్యాంగులం కాబట్టి ఇతర మినహాయింపులు ఏమాత్రం లేకున్నా ఇతరులతో పోటీ పడతామంటూ చెప్పడం గొప్ప విషయంగా మంత్రి చెప్పారు. దివ్యాంగుల కోసం గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్న అశోక్ గిరి దంపతులను మంత్రి అభినందించారు. సంస్ధ విస్తరణ అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *