దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: రెవెన్యూ అధికారి భిక్షానాయక్

దివ్యాంగులకు అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి భిక్షానాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృధ్ధుల శఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి  దివ్యాంగుల కమిటి, డిడిఆర్ సి (డిస్ట్ర్రిక్ట్ డిసేబిలిటి రిహబిలేషన్ సెంటర్) కమిటి సభ్యులు సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్య శాలలో సదరం క్యాంపు నిర్వహించి  అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తారని తెలిపారు. సదరం క్యాంపులో ఇదివరకు సర్టిఫికెట్లు పొందిన వారు రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. అర్హత లేనివారికి సర్టిఫికెట్లు జారీ చేయరని స్పష్టం చేశారు. కొందరు వృద్ధులను వారి సంతానం పట్టించుకోవటం లేదని, వృద్ధులను అనాధ శరణాలయాల్లో వదిలి పెట్టటం బాధాకరమని అన్నారు. వృద్ధుల పోషణ బాధ్యతలను చూసుకోవాల్సిన అవసరం వారి సంతానంపై ఉందన్నారు. బ్యాంకులు, ఆసుపత్రులకు వెళ్ళే వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు, క్యూ లైన్ల ఏర్పాటుకు  చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వృద్ధులు, దివ్యాంగులకు వారికి కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం నాడు సేవా భావంతో పని  చేస్తున్న దివ్యాంగులకు ప్రశంసా పత్రాలు ఇవ్వాలని దివ్యాంగుల కమిటి సభ్యులు కోరారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం నాడు నిర్వహించే కలెక్టర్ ఎట్ హోంకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఆహ్వనించాలని కోరారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో జిరియోట్రిక్ వారు ఏర్పాటు చేయాలని దివ్యాంగులకు అన్ని ప్రభుత్వ శాఖలో 5 శాతం రిజర్వేషన్లు, నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. ఈ అంశాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ నెల 5వ  తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకుల రుణ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్, రామ్మోహన్  రావు, మెప్మా పి.డి. పవన్ కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అజయ్, నగర పాలక సంస్ధ కమిషనర్ కె. సత్యనారాయణ, డీఆర్డీఏ ఏపిడి వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్, డిసేబుల్డ్ (దివ్యాంగుల) సంఘాల ప్రతినిధులు కుమారస్వామి,  రాజు, శోభారాణి, సత్తయ్య, సంపత్ అశోక్ కుమార్, వయో వృద్ధుల సంఘాల ప్రతినిధులు సముద్రాల జనార్ధన్ రావు, తోట లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *