దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుల్లో రేపు తీర్పు వెల్లడించనున్న ఎన్ ఐఏ కోర్టు..

 

మూడున్నర యేళ్ల తర్వాత దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో విచారణ ముగిసింది. వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 13న తీర్పు ప్రకటించనుంది ఎన్.ఐ.ఏ.కోర్టు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించింది. 502డాక్యుమెంట్లు సేకరించిన ఎన్.ఐ.ఏ. 201 మెటిరీయల్ ను సీజ్ చేసింది.18మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించేలా ఎన్.ఐ.ఏ బలమైన సాక్షాదారాలను సమర్పించింది. ప్రాసిక్యూషన్ ను బలహీన పర్చేందుకు నిందుతులు ఎత్తులకు పై ఎత్తులు పన్నారు. దీంతో తీర్పు ఎలా రానుందనే ఉత్కంఠ నెలకోంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ ను వణికించిన పేలుళ్ల కేసులో వాదనలు పూర్తయ్యాయి.  పేలుళ్లకు పాల్పడింది మేమే అంటూ ప్రకటించిన ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన వారికి శిక్ష పడేలా ఎన్.ఐ.ఏ. సాక్షాదారాలు సేకరించింది. 6గురి నిందుతుల్లో5గురుని అరెస్ట్ అయ్యారు. పేలుళ్ల కేసులను ప్రత్యేకంగా పరిగణించి..నాంపల్లి కోర్టు నుంచి రంగారెడ్డి కోర్టు..ఆ తర్వాత చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి వారానికి మూడు రోజుల విచారణ జరిపారు. మొత్తం 157 మందిని సాక్షులుగా స్టేట్ మెంట్ నమోదు చేశారు. కీలకమైన 502డ్యాకుమెంట్లు సేకరించింది.సంఘటన స్థలంలో 201 మెటిరియల్ సీజ్ చేశారు. వీటన్నింటి పై ఎన్.ఐ.ఏ.తరుపున బలమయిన వాదనలు వినిపించారు. అయితే సాక్షులను విచారించే సమయంలో నిందుతులు కేసు నుంచి తప్పించుకునేందుకు లా పుస్తకాలు చదివారు. క్రాస్ ఎగ్జామినేషన్ లో డిఫెన్స్ లాయర్స్ కు సహాయం చేశారు.న్యాయనిఫుణులతో విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. సాక్షులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే ఎన్.ఐ.ఏ. సాక్షులు భయాందోళనకు గురికాకుండా బరోస కల్పిస్తూ న్యాయమూర్తి ముందు విచారణకు హాజరయ్యేలా చూశారు. ఈ కేసులో మూడు చార్జీషీట్లు చార్జీషీట్ దాఖలు చేశారు. ఏ1 గా రియాజ్ భత్కాల్, ఎ2గా అసదుల్లా అక్తర్ ఏ3గా యాసిన్ బత్కల్, ఏ4గ తహాసిన్ అక్తర్ అలియస్ మోను, ఎ4 వకాస్ ఏ5 గా యాసిన్ బత్కాల్.. ఏ6 ఏజాజ్ ఉన్నారని దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పేర్కొంది. ఇందులో అక్తర్ అలియస్ మోను దిల్‌షుక్‌నగర్‌ బ్లాస్ట్‌లో బాంబును అమర్చినట్లు చార్జీషీట్లో తెలిపారు. చార్జీషీట్‌ను దాఖలు చేసేముందు ఇద్దరు ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. మరో ప్రదాన నిందుతుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్‌లో స్థావరం ఏర్పాటు చేసుకొని ఇండియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని చార్జీషీట్ స్పష్టం చేసింది. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఎజాజ్ చేశాడని గుర్తించారు.హైదరాబాద్‌ను2007లో మాదిరిగానే మరోసారి టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న రియాజ్ భత్కల్,2012 సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్, వఖాస్‌లను పాకిస్థాన్ నుంచి మంగుళూరుకు పంపినట్లు పోలీసులు అదారాలు సేకరించారు.  ఎజాజ్ 2013ఫిబ్రవరిలో 6 లక్షల 80వేలు పంపాడని సాక్షాదారాలు సేకరించారు. ఉగ్రవాదులు ఆ నగదును వినియోగించే దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. 138 మందికి గాయాలయ్యాయి. నిందుతుల పై ipc 302, 307, 324, 326, 316, 121, 121 ఏ,122, 201, రెడ్ విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.దీంతో పాటు,.పేలుడు పదార్ధాల1908 యాక్ట్ ప్రకారం 3, 5 సెక్షన్లతో పాటు,.దేశ ద్రోహం చట్టం 1967ప్రకారం 18,19,20,38 (2), 39 (2)సెక్షన్స్ పై ఎన్.ఐ.ఏ. అభియోగ పత్రాలు దాఖలు చేసింది..

A-1గా రియాజ్ బత్కాల్

A-2గా అసదుల్లా అక్తర్

A-3గా అక్తర్ అలియస్ మోను

A-4గా వకాస్

A-5గా యాసిన్ బత్కల్

A-6గా  ఎజాజ్ తో పాటు ఇతరులు అని చార్జీషీట్లో పెర్కొంది.

dilshuknagar-bomb-blast1     dilshuknagar-bomb-blast3     dilshuknagar-bomb-blast5

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.