
శ్రీకాకుళం : కేరింత సినిమా నిర్మాత దిల్ రాజు, హీరో హీరోయిన్ల బృందంపై శ్రీకాకుళంలో దాడి జరిగింది. కొంత మంది విద్యార్థులు కేరింత సినిమాలో శ్రీకాకుళం యాస ను అవమానించారని దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ పై కోడిగుడ్ల తో దాడి చేశారు.
ఈ దాడిలో చిత్ర బృందంపై కోడిగుడ్లు టమాటాలు పడ్డాయి. విద్యార్థులు దిల్ రాజు కారును కూడా అడ్డుకున్నారు. చిత్ర బృందానికి, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, గొడవ జరిగింది. పోలీసులు చిత్ర బృందాన్ని పక్కకు తప్పించి తరలించి విద్యార్థులను చెదరగొట్టారు.