
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కే.రాంచంద్రమూర్తి రాసిన ‘Unveiling Telangana State’ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది.. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్ రావు సభాధ్యక్షత వహించిన ఈ సభలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పుస్తకావిష్కరణ చేశారు.
కే.రాంచంద్రమూర్తి గతంలో పనిచేసిన హాన్స్ ఇండియా పత్రికలో రాసిన ఎడిటోరియల్స్ నుంచి సేకరించిన వ్యాసాలతో ఎమ్మెస్కే అధినేత విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాంచంద్రమూర్తి గారు తెలంగాణ గోసను ఈ వ్యాసాల్లో ఆవిష్కరించారు. వీటన్నింటిని సేకరించి బుక్ గా మలిచారు ఎమ్మెస్కే పబ్లిషర్స్ .. వీటిని పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆదివారం హైదరాబాద్ లో దిగ్గజాల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్, విద్యావేత్త చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ కృష్ణరావు, విశ్లేషకులు తెలకపల్లి రవి, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, రత్నమాల, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఎమ్మెల్సీ నాగేశ్వర రావు, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అయిలు రమేశ్, పలువురు జర్నలిస్టులు, సాహితీ అభిమానులు, రాంచంద్రమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు కే. రాంచంద్రమూర్తి పుస్తకం, రచనలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ చరిత్రను, గోసను పుస్తకంలో బాగా ఆవిష్కరించారని పొగిడారు.