
-దాసరి సౌభాగ్య మీడియాకు చెందిన 2 కోట్ల విలువైన ఆస్తి జప్తు
హైదరాబాద్ : బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించేందకు సుప్రీం కోర్టు అనుమతివ్వడం.. మరోవైపు ఆ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి ఆస్తులు జప్తు చేయడం వరుసగా జరిగిపోయాయి.
దాసరి కి చెందిన సౌభాగ్య మీడియా కు చెందిన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సౌభాగ్య మీడియా భవనం, 50 లక్షల డిపాజిట్స్, ఖరీధైన రెండు కార్లు జప్తు చేశారని సమాచారం.