దాసరిని పరామర్శించిన తలసాని…

దాసరిని పరామర్శించిన తలసాని...

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇటీవల కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాసరిని పరామర్శించారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర్ర పశువర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసరిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాసరి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తండ్రిలాంటి వారని, పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారని ఆయన అన్నారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం కలచి వేసిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందని, త్వరలో కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారని వారి దీవెనలే ఆయన్ను రక్షిస్తాయని అన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వెంట రామ్ గోపాల్ పేట కార్పోరేటర్ అత్తిలి అరుణ గౌడ్, బేగం పేట కార్పోరేటర్ తరుణి, నరేందర్, శ్రీనివాస్ గౌడ్, కాదంబరి కిరణ్, కొండేటి సురేష్ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *