Breaking News

దాసరికి చుక్కలు చూపిన ఏపీ పోలీసులు

Akshara_Anjali_Function_Stillsbe811f9b4cfd4b1ffbed975a50248b2b

పాపం దాసరి.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.. అదేదో పాకిస్తాన్ వెళ్లినట్టు తనకు అనిపించిందని.. ఏపీలో ఇంత దారుణ పరిస్థితులుంటాయని తాను కలలో కూడా ఊహించలేదన్నారు.. క్రిమినల్స్ ను వెంటాడినట్టు తనను వెంటాడని.. తెలుగు జాతికి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు..

ఏపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలపడానికి వస్తున్న దాసరి నారాయణ రావుకు సంఘీభావం తెలపడానికి దాసరి హైదరాబాద్ నుంచి బయలు దేరారు.. కృష్ణ జిల్లా నందిగామలో పోలీసులు అడ్డుకోవడంతో ఆయన సూర్యపేట నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడవుల ద్వారా తూ.గోదావరి జిల్లాకు బయలు దేరారు..  రాజమండ్రికి చేరుకొని హోటల్లో బస చేయగానే దాసరిని పోలీసులు చుట్టుముట్టారు..  ఆయనను కిర్లంపూడికి వెళ్లనీయలేదు.. పోలీసులు దాసరి అష్ట దిగ్బంధనం చేయడంతో ఆయన దిక్కుతోచక హోటల్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో దారుణ పరిస్థితులున్నాయని వాపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *