దార్శనికుడు పీవీకి బీజేపీ గౌరవం

-ఢిల్లీ యమున నది ఒడ్డున పీవీకి స్మారకం నిర్మాణం

ఢిల్లీ : దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన దార్శనికుడిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించినా బీజేపీ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని ఇనుమడింపచేయడానికి నిర్ణయించింది. దేశానికి ఎంతో సేవ చేసిన పీవీకి యమున నది ఒడ్డున ఢిల్లీలో ఏక్తాస్థల్ లో స్మారకం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఆర్థిక సంస్కరణల వైతాళకుడిగా దేశాన్ని గట్టెక్కించిన పీవీకి సొంత పార్టీ కాంగ్రెస్ విస్మరించిందని పీవీకి స్మారకం నిర్మించాలని గత సమైక్య ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి  మంత్రిత్వ శాఖ ఓ కేబినెట్ నోట్ ను సిద్ధం చేసి పంపింది. తాజా ప్రతిపాదన మేరకు  పీవీ స్మారకాన్ని  చలువరాతితో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 లో పీవీ మరణిస్తే స్థలం లేదని పీవీకి స్మారకం ఏర్పాటు చేయదని తేల్చిచెప్పింది.

కాగా పీవీ స్మారక నిర్మాణం విషయంలో రాజకీయం ఉందని.. బాబ్రీ మసీదు కూల్చివేతలో సహకారం అందించారనే పీవీ స్మారకాన్ని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నిర్మిస్తోందని.. సమాజ్ వాదీ పార్టీ నేత యూపీ మంత్రి అజం ఖాన్ ఆరోపించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *