దసరా లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి: మంత్రి ఈటల రాజేందర్

DSC_7167తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నం, బలమైన కోరిక పేద ప్రజలకు డబుల్ బెడ్రూం లఇళ్ల నిర్మాణం చేయడమేనని, వీటిని దసరా లోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆర్థికశాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం నాడు జరిగిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ తదితరాంశాలపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ భూ ప్రక్షాళన చేసి, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం ,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి మిషన్ భగీరథ బల్క్ వాటర్ అన్ని గ్రామాలకు అందించడానికి లక్ష్యంగా నిర్ణయించామని, కానీ జిల్లాల్లో రైల్వే క్రాసింగ్ అటవీ అనుమతులు, రోడ్డు కటింగు అనుమతులు పొందడంలో ఆలస్యం జరిగిందని , జూన్ 30 నాటికి జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ బల్క్ వాటర్ అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూం ల ఇళ్ల నిర్మాణాలకు ఐరన్ ధరలు పెరగడం, ఇళ్ల నిర్మాణాలకు భూములు లేకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నందున, నైపుణ్యంగల కార్మికులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని మంత్రి తెలిపారు .జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం గా జరిగేందుకు ప్రతి మండలానికి ఒక అవుట్సోర్సింగ్ ఏఈని నియమించాలని మంత్రి ఆదేశించారు .ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన స్థలం 15 రోజుల్లో సేకరించాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక ఇబ్బందిలేకుండా జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను 60 సి కింద కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆర్అండ్బి అధికారులను మంత్రి ఆదేశించారు. షార్ట్ టెండర్ నోటీసులు ఆహ్వానించి గృహాల నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై పర్యవేక్షణ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఈటెల రాజేందర్ జిల్లా కలెక్టర్ కు సూచించారు. రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక భూమి అని, పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు భద్రత ,భరోసాను కలిగిస్తాయని మంత్రి అన్నారు. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను ,భూప్రక్షాళన లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తమ ప్రభుత్వం సరి చేసిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.  ఈ సమీక్షా సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ,మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, idc చైర్మన్ ఈద శంకర్రెడ్డి, కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు ,గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి ,జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి అయేషా ,మిషన్ భగీరథ ఎస్. ఈ అమరేందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈ ఈ రాఘవచారి తదితరులు పాల్గొన్నారు.                                           DSC_7169DSC_7138

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *