దసరా లోపు ఉపాధి కూలీలకు బకాయిల చెల్లింపు : మంత్రి జూపల్లి కృష్ణారావు

దసరా లోపు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి బకాయి లేకుండా  కూలీ డబ్బులు చెల్లించేందుకు
చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి
అమర్జీత్ సిన్హాతో మంత్రి గురువారం బేటీ అయ్యారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు
మీడియాతో మాట్లాడుతూ… మహాత్మ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమ్మెంట్ గ్రాంట్ ఫ‌థ‌కంలో
భాగంగా రాష్ట్రానికి రావాల్సిన 250 కోట్ల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా ను కోరినట్లు మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం
కేంద్రం నిధులను గడువు లోపు చెల్లించకపోవడం వల్ల ఉపాధి హామి కూలీలకు సమయానికి కూలీ
డ‌బ్బులు చెల్లించడం ఇబ్బందిగా మారుతుంద‌న్నారు. గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
నరేంద్ర సింగ్ థోమర్ కలిసి బకాయి నిధులపై చర్చించామని, ప‌లుమార్లు లేఖ‌లు కూడా రాసిన‌ట్లు
మంత్రి గుర్తుచేశారు. బకాయి నిధుల్లో 200 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేస్తున్నట్లు కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా చెప్పార‌న్నారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్
నిధుల్లో రాష్ట్రానికి మరో 500 కోట్లు కేంద్రం బకాయి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు
చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో కేంద్రం కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఉపాధి
హామీ కోసం 150 కోట్లు అదనంగా నిధులు ఖర్చు చేసింద‌ని ఆయ‌న వివ‌రించారు.
గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల 60 లక్షల పనిదినాలను తెలంగాణ కూలీలు
వినియోగించుకున్నార‌ని, త‌ద్వారా కేంద్రం కేటాయించిన 8 కోట్ల పనిదినాల కంటే, 4 కోట్ల
పనిదినాలు అదనంగా దక్కించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం విజయవంతమ‌యింద‌ని మంత్రి
వివరించారు. అలాగే ఈ ఏడాది కూడా మరో 3, 4 కోట్ల పని దినాలను అదనంగా ఇవ్వాలని కేంద్ర

గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హాను కోరామని, అందుకు ఆయ‌న సానుకూలంగా
స్పందించారని మంత్రి తెలిపారు.  అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డా.
నగేశ్ సింగ్ తోనూ తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి
కృష్ణారావు భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ చేపట్టిన పథకాలు, అభివృద్ధి
అంశాలపై అదనపు కార్యదర్శి డా. నగేశ్ సింగ్ తో మంత్రి చ‌ర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది,
గ్రామీణా కూలీల జీవన పరిస్థితులు మెరుగుపరిచేలా తెలంగాణ రాష్ట్రం చేస్తోన్న కృషికి
సహకరించాలని ఆయ‌న‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో దినసరి కూలీల ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ప్ర‌తి  కూలీకి  100
రోజుల పనిదినాలు కల్పించేలా సీయం కేసీఆర్ ఆలోచ‌న‌ చేస్తున్నారని మంత్రి అన్నారు. త్రాగునీటి
పైపులైన్లు, నీటి ప్రాజెక్ట్ ల పూడిక‌తీత‌, హరితహారం వంటి కార్యక్రమాల్లో ఉపాధి కూలీలకు అవకాశం
కల్పిస్తూ, వారి జీవన పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సూచనలతో కేంద్ర ప్రభుత్వం అందించే కోట్ల రూపాయల
మెటిరియల్ కాంపోనెంట్ నిధుల్లో ఒక్క రూపాయిని కూడా ల్యాప్స్ కాకుండా చర్యలు
తీసుకున్నామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయి నిధులు పెండింగ్ లో ఉన్నా,
ఉపాధి కూలీలకు దసరా లోపు ఒక్క రూపాయి బకాయి లేకుండా నిధులు చెల్లించనున్నట్లు
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా, అదనపు కార్యదర్శి డా. నగేశ్ సింగ్ ల తో జరిగిన
సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తో
పాటు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ‌ ప్రిన్సిపల్
సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *