దసరాకు 3600 ప్రత్యేక బస్సులు

దసరా పండుగకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 3600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, ప్రాంతాలతో పాటు ఏపిలోని కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంధ్యాల, ఒంగోలు లతో పాటు కర్ణాటక, చెన్నై (తమిళనాడు), ముంబాయి, పూణె ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయాణీకులకు
26 నుండి 29 తేదీలలో రద్దీ ఎక్కువుగా ఉండే నేపధ్యంలో నగర శివార్ లోని జెబిఎస్, ఎల్ బినగర్, ఉప్పల్ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. రంగారెడ్డి సిటీ ఆర్ ఎంలతో పాటు ఉద్యోగులు ప్రయాణికులకు సేవలందించటం కోసం 24/7 అందుబాటులో ఉంటారన్నారు.

About The Author

Related posts