Breaking News

దళిత, గిరిజన సంక్షేమ చట్టాలు పటిష్టంగా అమలు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

దళిత, గిరిజన సంక్షేమ చట్టాలు పటిష్టంగా అమలు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు రూపొందించిన చట్టాలను పటిష్టంగా అమలుచేస్తామని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో దళిత, గిరిజనులపై అట్రాసిటి నిరోధానికి రూపొందించిన పిసిఆర్ ఆక్ట్ 1955, పిఓఏ ఆక్ట్ 1989 లపై జిల్లా స్ధాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెల 30న జరిగే సివిల్ రైడ్స్ డే న సంబంధిత గ్రామానికి విచారణకు ఎంపిడివోలు, తహసిల్దారు, సబ్ ఇన్స్ పెక్టర్ ఖచ్చితంగా హజరవ్వాలన్నారు. దళిత, గిరిజనులకు సంబంధించిన భూసమస్యలను త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. దళితులకు గతంలో ఇచ్చిన భూములను ఎన్ఆర్ఇజిఎస్, ఇతర పధకాల ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కమిటి సభ్యులు అడిగిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపి నిర్ణీత గడువు లోపు చర్యలు తీపుకుంటామన్నారు. గతంలో పంపిణి చేసిన భూములు సర్వే చేయకుండా వుంటే, వెంటనే సర్వే ప్రక్రియ చేపట్టి హద్దులు నిర్ణయిస్తామన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. కమిటి సభ్యులకు 3 రోజుల ముందు సమావేశ వివరాలు పంపుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ,జిల్లాలో 158 దళిత, గిరిజన అట్రాసిటి కేసులు పెండింగులో వున్నాయన్నారు.

DSC_4572

ఇట్టి కేసులలో 30 కేసులు హైకోర్టు స్టే ఆర్డర్ వుందన్నారు. మిగతా కేసులు వివిధ స్ధాయిల్లో వున్నాయన్నారు. దళిత, గిరిజన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు, పోలీసు అధికారుల జాప్యంతో నిందితులు లబ్ది పొందే అవకాశం కల్గకుండా, అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలిస్తున్నట్లు ఎస్పి తెలిపారు. కేసు రిజిష్టరు అయిన వెంటనే రశీదు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పి తెలిపారు. పోలీసు శాఖలోని లీగల్ సెల్ తో సంప్రదించి తీర్పులు వచ్చిన కేసులలో పై కోర్టులలో అప్పీల్ అవకాశాల కు చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పి తెలిపారు. క్రొత్తగా చట్టంలో పొందుపర్చిన విధానాలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పి తెలిపారు. ఈ సమావేశానికి జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, గోదావరిఖని ఎఎస్పి విష్ణు వారియర్, అదనపు సంయుక్త కలెక్టర్ డా.ఏ. నాగేంద్ర, జిల్లా రెవిన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్య, జడ్పీ సిఇవో సూరజ్ కుమార్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంధని ఆర్గీవోలు చంద్రశేఖర్, బిక్షా నాయక్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్, కమిటి సభ్యులు జె. చంద్రయ్య, బి. శంకర్, వి.విజయ్ కుమార్, ఎం. దుర్గా ప్రసాద్, కుడిమేత సమ్మయ్య, పెద్ది శంకర్, గులాబీల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts