దర్శకుడి చెంప చెళ్లుమనించిన నటి

ముంబాయి : ఓ సినిమా ఆడియో ఫంక్షన్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్..సినిమా యూనిట్.. ఇతర అతిథులు ఉన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ వర్ధమాన నటి వచ్చి డైరెక్టర్ తో వాగ్వాదం పెట్టుకుంది. వెంటనే ఆ డైరెక్టర్ ను చాచి కొట్టింది. ఒక్కసారిగా నిశబ్ధం..ఆడియో ఫంక్షన్ కాస్తా రణరంగంగా మారింది. అసలు ఎవరా నటి ? ఎందుకు కొట్టింది అని అందరూ ఆరా తీశారు.

అసలు ఆమె ఎందుకు కొట్టింది ?
త్రీ స్టార్ హోటల్ లో కెన్ డ్యాన్స్ సాలా ఆడియో ఫంక్షన్..
ముంబాయిలోని త్రీ స్టార్ హోటల్ లో ‘ ముంబాయి కెన్ డ్యాన్స్ సాలా మూవీ’ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. ఈ సినిమాకు సచీంధ్ర శర్మ దర్శకుడు. బాలీవుడ్ హాట్ ఐటం గర్ల్ రాఖీ సావంత్, ఆదిత్యపంచోలి, శక్తి కపూర్‌తో పాటు మరికొందరు నటీనటులు ఇందులో నటిస్తున్నారు. వేదికపై రాఖీ సావంత్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా ఉంది. సినిమా దర్శకుడు సచీంధ్ర శర్మ అన్నీ తానై వ్యవవహరిస్తున్నాడు. ఒక్కరొక్కరుగా స్టేజ్‌ మీదకు అతిధులు వస్తున్నారు. ఇంతలోనే వర్ధమాన నటి ‘మనీషా’ వేదికనెక్కింది. నేరుగా డైరెక్టర్‌ సచీంధ్ర శర్మ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగింది. వాదన పెట్టుకుంటూనే దర్శకుడు సచీంధ్ర శర్మను చాచి పెట్టి కొట్టింది.

అసలు ఎందుకు కొట్టింది ?
ఈ సినిమాలో అవకాశం కావాలంటే తన అవసరాలు తీర్చాలని సచీంధ్ర షరతులు పెట్టాడని మనీషా ఆరోపిస్తోంది. తాను లొంగకపోవడం వల్లే సినిమా నుంచి తప్పించాడని మనీషా చెబుతోంది. అందుకే సచీంధ్ర శర్మ చెంప చెళ్లుమన్పించానంటోంది. మరోవైపు వివాదాస్పద రాఖీ సావంత్ కూడా మనీషాకే మద్దతు పలికింది.

అంతా అబద్ధం అంటున్న సచీంధ్ర..
అయితే దర్శకుడు సచీంధ్ర మాత్రం ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నాడు. మనీషా ఎవరో కూడా తనకు తెలియదన్న సచీంధ్ర కేవలం చీప్‌ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోందని ఫైరవుతున్నాడు.

ఏది ఏమైనప్పటికీ మనీషా ఇచ్చిన ట్రీట్మెంట్‌కు బాలీవుడ్ నివ్వెరపోయింది. సచీంధ్ర తప్పు చేసి ఉంటే మనీషా చేసిన పని సరైనదేనంటూ బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.