
హైదరాబాద్, ప్రతినిధి :‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది..’ క్యా బాత్ హై.. క్యా బాత్ హై.. దత్తన లేఖాస్త్రంలోనే కాదు.. పాటలు పాడడంలో కూడా సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ప్రతిభా పురస్కరం ప్రధానంలో భాగంగా చంద్రబోస్ కు ఎన్టీఆర్ పురస్కారాన్ని సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రం కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగంలో నోరు సవరించుకున్నారు.. తన గాత్రంతో మౌనంగానే ఎదగని పాట పాడి అందరినీ అలరించారు.
ప్రసంగం చేస్తారనకుంటే అద్వితీయంగా పాట పాడిన దత్తన్న సాంగ్ కు అక్కడున్న సభికులు, వేదికపైనున్న వారు ఆశ్చర్యపోయారు. ఇంత ట్విస్ట్ ఇచ్చిన దత్తన్న పాట ముగియకముందే సభికులు చప్పట్లతో తమ అభినందనలు తెలియజేశారు.