దట్ ఈజ్ కెసిఆర్

ఈ రోజు సచివాలయంలో ‘‘దట్ ఈజ్ కెసిఈర్‘‘ పుస్తకాన్ని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి పుస్తకం ను ఆవిష్కరించటం పట్ల ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. త్రినేత్ర రాసిన ఈ పుస్తకాన్ని బిసి కమీషన్ సభ్యులు జాలోరి గౌరిశంకర్ పబ్లిస్ చేయించారు. తెలంగాణ ఉద్యమం లో కీలక ఘట్టాలను కెసిఆర్ ఏవిధంగా ఉద్యమ వ్యాప్తికి ఉపయోగించారో త్రినేత్ర ఈ పుస్తకంలో పొందుపరిచారు.తెలంగాణ ఉద్యమనేత వేరు వేరు వర్గాలకు కెసిఆర్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన కమిట్ మెంట్ ను ఎవరూ శంఖించలేదని ఆర్ధికమంత్రి ఈటెల అన్నారు. దేశానికి పోరాట స్ఫూర్తిని నేర్పిన నేల తెలంగాణ అని ఈటెల అన్నారు. ఈ నేలపై జరిగిన ఆత్మగౌరవ, అస్ధిత్వ పోరాటాలు అంతిమంగా విజయం సాధించాయని, అహింసాయుత ఈ పోరాటం దేశానికే ఆదర్శం అని మంత్రి ఈటెల అన్నారు. రెండు తరాలు పోరాటం చేసిన తరువాత నిరాశ నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజానికి విశ్వాసం కలిగించిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. ఈ పుస్తకానికి ’’దట్ ఈజ్ కెసిఆర్‘‘ అని పెట్టటం సమంజసం అని అన్నారు. తెలంగాణ సాధించడం ఒక గొప్ప విషయం అయితే… ఉద్యమ పార్టీ అయి ఉండి పరిపాలనలో సక్సెస్ కావడం మరో గొప్ప విషయం అని అన్నారు. దేశంలో ఉద్యమ పార్టీలన్నీ పరిపాలన విఫలమయ్యాయన్నారు. కానీ కెసిఆర్ చతురత, నైపుణ్యంతో పరిపాలనలో సైతం విజయం సాధించారని, అందుకే ‘‘దట్ ఈజ్ కెసిఆర్’’ అని అనిపించుకున్నారని మంత్రి ఆటెల అన్నారు. కెసిఆర్ ను విమర్శిచే వ్యక్తులు, నచ్చని వ్యక్తులు ఉన్నా తెలంగాణ సాధించే విషయంలో కెసిఆర్ కమిట్ మెంట్ ను వరూ శంఖించలేదని అందుకే ఆయన ‘‘దట్ ఈజ్ కెసిఆర్’’. విమర్శలు చేసిన వారికి అప్పుడు ఉద్యమంలో, ఇప్పుడు తన పనితీరులోనే సమాధానం చెప్పారని అన్నారు. మీకు పరిపాలించుకునే శక్తి ఉందా అని ప్రశ్నించిన వారికి తెలంగాణ సత్తా చూపించాం, కెసిఆర్ సత్తా చూపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఢిల్లీలో మాకు మంత్రులుగా గౌరవం లేకుండేదని, కాని ఇప్పుడు పిలిచి కూర్చో బెడుతున్నారని మంత్రి అన్నారు. దేశం పటంపై తెలంగాణ ముద్ర వేసి వ్యక్తి కెసిఆర్ అని మంత్రి ఈటెల పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కొనియాడారు.

eatela rajender

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *