Breaking News

దక్షిణ అమెరికాలో కనుమరుగైన ‘గినీ పిగ్’

skinny guinea pig on white background

లండన్ : సుమారు 30 లక్షల ఏళ్ల కిందట భూమి ఎలాగుండేది.. వేటి సామ్రాజ్యం ఈ భూమిపై ఉండేది. ప్రకృతి పచ్చదనంతో నిండుగా చెట్లతో నిండియున్న ఈ భూగ్రహంపైనే లక్షల ఏళ్ల కిందట డైనోసార్లదే రాజ్యం.. ఒక్కోటి ఒక్కో గుట్ట అంత పెద్ద డైనోసార్లు ఉండేవి. వాటి నోటికి ఏ చిన్న జంతువు దొరికినా అంతేహాంఫట్.. అలాంటి రాజ్యాలు ఎలా అంతరించాయి. దానికి పరిశోధకులు చెప్తున్న సమాధానం. ఒక భారీ విస్పోటనం భూమిపై సంభవించిందని.. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల కొన్ని వేల అణుబాంబులు విడుదల చేసిన శక్తి విడుదల అయి భూమిపైనున్న భారీ జంతువులైన రాక్షస బల్లులు అంతరించిపోయాయని చెబుతున్నారు.

వాటి తర్వాత భూమిపై చాలా జంతువులు మనుగడ సాధించాయని.. కానీ డైనోసార్ల మనుగడ సాధించలేదు. వారి అంతర్థానం తర్వాత శాస్త్రవేత్తలకు ఒక అరుదైన జంతువు మనుగడ సాధించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 30 లక్షల ఏళ్ల కిందట గినీ పిగ్(గినీ పంది) లాంటి ఓ భారీ ఎలుక భూమ్మీద సంతరించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని అవశేషాలును లండన్ లోని యోర్క్ యూనివర్సిటీ, దిహాల్ మెడికల్ స్కూలు పరిశోధకులు దక్షిణ అమెరికాలో కనుగొన్నారు. జోన్ఫోర్టిగేసియా అనే ఈ ఎలుక బరువు దాదాపు వెయ్యి కిలోలని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి ఎలుకలు 100 గ్రాముల బరువుంటాయి సుందెలుకలు కనీసం కుందేలు అంతా బరువుంటాయి. కానీ గినీ పిగ్ ఓ దున్పపోతంతా ఎత్తు, బరువు ఉండేదట.. దీని బరువు ఏకంగా 1000 కిలోలు ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ అమెరికాలో జీవిస్తుండేదని పరిశోధకులు గుర్తించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *