Breaking News

దందాల డొంక కదిలిస్తున్నకరీంనగర్ ఎస్పీ

SP Sir1

కరీంనగర్ : కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాద్ రావు ఆత్మహత్యకు కారకుడైన ఏఎస్ఐ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. మొదటి నుంచి ఏఎస్సై మోహన్ రెడ్డి అక్రమంగా పోలీసులు సంపాదించిన సొమ్మును అప్పుగా ఇస్తుంటాడు. కెన్ క్రెస్ట్ ప్రసాద్ రావుకు 75లక్షలు అప్పు ఇచ్చాడు. వాటిని ఆయన చెల్లించకపోవడంతో ఏఎస్ఐ గన్ తో బెదిరించాడు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్ రావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదై అరెస్ట్ అయిన మోహన్ రెడ్డిపై కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోహన్ రెడ్డికి భారీగా అక్రమ సొమ్ము ఇచ్చిన పోలీసులందరినీపై విచారించి వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే పెద్దపల్లి, గోదావరిఖని 2వ టౌన్ లను వేకెన్సీ రిజర్వ్ లో పెట్టి బదిలీలు  చేశారు. అక్రమార్కులను వదిలేదని లేదని మోహన్ రెడ్డి విచారించగా ఆదేశాలిచ్చారు.

దీంతో పోలీసుల్లో గుబులు మొదలైంది. ప్రసాద్ రావు సూసైడ్ కు తన బెదిరింపులే కారణమని ఏఏస్సై మోహన్ రెడ్డి ఒప్పుకొని జిల్లాలో తనకు సహకరించిన పోలీసులు పేర్లు చెప్పాడట.. దీంతో ఇప్పుడు వారందరి డొంక కదలనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *