దంచికొడుతున్న వర్షాలు

వానలు దంచికొడుతున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి రుతుపవనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో ముసురు అలుముకుంది. ఉత్తర తెలంగాణలో వానలు మరీ బాగా కొడుతున్నాయి. ఆదిలాబాద్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, జిల్లాల్లో వానలు తొలిగిపోవడం లేదు. శుక్రవారం మొదలైన వానలు ఆదివారం వరకు కొనసాగాయి. ఈ ధాటికి వాగులు, వంకలు నిండిపోయాయి. నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు నిండాయి.

కాగా వర్షాలు మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి ఆదిలాబాద్ లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. గోదావరి నదిలోకి వరద ఉదృతి పెరిగింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *