త‌ల్ల‌డిల్లుతున్న *తెలుగు*హృద‌యాలు!

హైద‌రాబాద్‌:-  ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాల న‌డుమ నెలకొన్న త‌గాదాల‌తో తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి క‌ల‌సిఉన్న ప్ర‌జ‌ల న‌డుమ రాష్ట్ర విభ‌జ‌న చిచ్చుపెట్టింద‌న్న ఆందోళ‌న అంద‌రి గుండెల‌ను పిండోస్తోంది. ప్ర‌ధానంగా రాజ‌కీయాంశాలే ప్ర‌జ‌ల న‌డుమ వైరుధ్యాల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌న్న సంగ‌తి కొంత‌మంది  గుర్తించ‌క‌పోయినా.. ఇత‌ర రాష్ట్రాలు, విదేశాల‌లో ఉంటున్న తెలుగువారంతా ప‌రిస్ధితుల‌ను గ‌మ‌నించి బాధాత‌ప్త హృద‌యుల‌వుతున్నారు. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న అవ‌స‌ర‌మైన‌ప్ప‌టికీ.. స‌మైక్యాంధ్ర చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి అభిప్రాయ‌మే ఇప్పుడు నిత్య‌స‌త్య‌మై క‌నిపిస్తోంది. స‌మ‌గ్ర విభ‌జ‌న‌కు చ‌ర్చ‌లు, ఇరు ప్రాంతాల వారితో సంప్ర‌దింపులు అనంతరం విభ‌జ‌న జ‌రిగితే ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు సంతోషిస్తార‌ని , లేక‌పోతే నీళ్లు, విద్యుత్‌, ఉద్యోగాల‌తో స‌హా అన్ని అంశాల‌లో త‌గువులు త‌ప్ప‌వ‌ని కిర‌ణ్ చెప్పారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కే క‌ట్టుబ‌డిన కాంగ్రెస్ ఇవేమీ ప‌ట్టించుకోకుండా పచ్చ‌జెండా ఊప‌డం, దానికి బీజేపీ మ‌ద్ద‌తునీయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది.  6 ద‌శాబ్దాల పోరు సుఖాంత‌మై రాష్ట్రం ఏర్ప‌డిస‌న్ప‌టికీ, కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఊహించిన‌ట్లు త‌గువులు ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయి.
ప్ర‌తి అంశంలోనూ ప్ర‌తిష్ఠంభ‌నే:
 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్యఅధికారికంగా  విభ‌జ‌న జ‌రిగిన  2014 జూన్ 2 నుంచి అన్ని అంశాల‌లోనూ ప్ర‌తిష్ఠంభ‌నలే కొన‌సాగుతున్నాయి. కాల‌క్ర‌మేణా అవి మ‌రింత ఉధృత‌మ‌వుతున్నాయి, ఖ‌మ్మం జిల్లాలోని ప‌లు గ్రామాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌ప‌డం మొద‌లుకొని, సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ తో ప్రారంభ‌మైన త‌గాదా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్ట్ వ‌ద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే స్ధితికి చేరింది. అదేవిధంగా కృష్టా జ‌లాలు, ప్ర‌ధానంగా పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ఠ్‌కు శంకుస్ధాప‌న‌, త‌దిత‌ర అంశాలు వైష‌మ్యాల‌ను పెంచాయి. ఇవేగాక ఉన్న‌త విద్యామండ‌లి స్వాధీనం, వివిధ సంస్ధ‌ల బ్యాంకు అకౌంట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఫ్రీజ్ చేయించిన సంఘ‌ట‌న‌లు, 1400 మంది ఆంధ్ర‌ విద్యుత్ ఉద్యోగుల‌ను విధుల‌నుంచి తొల‌గించిన సంఘ‌ట‌న‌కూడా చిచ్చురేపాయి. తాజాగా ఓటుకు నోటు వ్య‌వ‌హారం రెండు రాష్ట్రాల‌ను బాగా కుదిపేసింది.  ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్,  రాజ‌ధానిలో ఆంధ్రుల‌కు భధ్ర‌త క‌రువు వంటి అంశాలుకూడా రెండు ఇరు ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య దూరాన్ని పెంచే ప్ర‌య‌త్నాలు చేశాయి. గ‌తంలో హైద‌రాబాద్‌లో ఆంధ్రులే ల‌క్ష్యంగా స‌ర్వే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే ఎంసెట్‌, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల సంయుక్త నిర్వ‌హ‌ణ అటకెక్కి ఎవ‌రిదారి వారు చూసుకున్నారు.  ఆంధ్ర‌పాల‌కుల వ‌ల్లే ఇంత‌వ‌రకు తెలంగాణ ప్ర‌జ‌లు రాజ‌కీయంగా, అన్నిర‌కాలుగా న‌ష్ట‌పోయార‌న్న ప్ర‌చార‌ ప్ర‌భావం బాగానే ప‌నిచేసింది. అందువ‌ల్లే ఏ చిన్న విష‌యంలోనూ తెలంగాణ ప్ర‌జ‌లు వ‌దులుకోవ‌డానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. పైగా ప్రాంతీయ భావాల‌తోనే రాజ‌కీయాలు న‌డిపేవారు 99 శాతం ఉన్నందున ఇరు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ధోర‌ణిలే కొన‌సాగుతున్నాయి. దానికి చ‌ర్చాగోష్ఠుల పేరిట టీవీ ఛానెల్స్ త‌మ వంతు ఆజ్యం పోస్తున్నాయి.ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ విష‌యంలోనూ త‌మ‌కు అన్యాయం చేసింద‌న్న ప్ర‌చారం బాగానే సాగింది.  ఏదిఏమైనా హైద‌రాబాద్‌లో ఎన్నిరాష్ట్రాల, దేశాల‌ ప్ర‌జ‌లు ఉన్న‌ప్ప‌టికీ ఆద‌రించే తెలంగాణవాదులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విషయంలో సానుకూల ధోర‌ణితో లేర‌న్న‌మాట వాస్త‌వం. దీనికి ప్ర‌ధాన‌కార‌ణం రాజ‌కీయ నాయ‌కుల రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలేన‌న్న‌ది తిరుగులేని య‌ధార్ధం.
ఆంధ్రాకు అన్నీ క‌ష్టాలే!
విభ‌జ‌న నాటి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్నీ క‌ష్టాలే ప్రారంభ‌మ‌య్యాయి. రాజ‌ధాని లేని రాష్ట్రంగా, లోటు బ‌డ్జెట్‌తో పాల‌న ప్రారంభించిన ఆంధ్ర‌కు కేంద్రం నుంచి తొలి ఏడాది ఆశించిన సాయం అంద‌లేదు. పెళ్లినాటి మాట‌లు యానాల నాడు ఉండ‌వ‌న్న‌ట్లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చి హామీల విష‌యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు వెన‌క్కిపోయాయి. . ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, రాజ‌ధాని నిర్మాణానికి, పోల‌వ‌రం ప్రాజెక్ట్‌లకు నిధుల మంజూరులో అల‌స‌త్వం వంటి అంశాలు ప్ర‌జ‌ల మ‌దిని కుదిపేశాయి. దీనికి తోడు ఉమ్మిడి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తెరాస నాయ‌కుల తీరు, పైగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల తూటాలు ఆంధ్ర‌ప్ర‌జ‌ల గుండెల్లో నాటుకుపోయాయి. రుణ మాఫీ క‌ష్టాలు, హుద్‌హూద్ తుఫాను న‌ష్టాలు, వెన్నాడాయి. చిత్తూరు జిల్లాలో ఎర్ర‌చందనం దొంగ‌ల ఎన్‌కౌంట‌ర్ కూడా రాష్ట్రానికి, ముఖ్యంగా త‌మిళ‌నాడులో తీవ్ర అవ‌మానాల‌కు తావిచ్చింది.నిధుల కొర‌త‌, అయినా అడ‌గ‌కుండానే ఉద్యోగుల‌కు ఊహించ‌ని పీఆర్‌సీ, ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఫిట్‌మెంట్‌ వంటి అంశాలు చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి శ‌రాఘాతాల‌య్యాయి. ఏడాది కాలంలో కేంద్రం సాయం, చంద్ర‌బాబు పాల‌న అంతంత మాత్రంగానే ఉన్నందున ప్ర‌జ‌లు పూర్తి సంతృప్తిగాలేరు.
తెలంగాణ‌లో త‌ప్ప‌ట‌డుగులు:
నిధుల విష‌యంలో మిగులు రాష్ట్రమైన తెలంగాణ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ప్ప‌ట‌డుగులు క‌నిపిస్తున్నాయి. అధికారంలోకి వ‌స్తే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామన్న ఆయ‌న ప్ర‌ధాన‌మైన ఉస్మానియా యానివ‌ర్శిటీ విద్యార్ధుల‌తో క‌య్యానికి దిగారు త‌న ఇంటిలోని న‌లుగురికి ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా రాజ‌కీయ నిరుద్యోగాన్ని రూపుమాపారు. ప్ర‌తి ఒక్క‌రికి రెండు గ‌దులు, హాల్, వంటిల్లు, ఇత‌ర సౌక‌ర్యాలు క‌లిగిన శ్లాబ్ ఇళ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చి వారిని మేఘాల్లోనే ఉంచారు. డిప్యూటీ సీఎం రాజ‌య్యను తొల‌గించి ఓ వ‌ర్గానికి దూర‌మ‌య్యారు. గ‌తంలో స‌ర్వే, రేష‌న్ కార్డులు, పెన్ష‌న్లు వంటి అంశాల‌లో చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకున్నారు. పోలీసింగ్‌, ఆటోలు ఇత‌ర విష‌యాల‌లో కొంత ప్ర‌యోజ‌నాన్ని సాధించిన ఆయ‌న తొలుత కేంద్రంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రి అవ‌లంభించి త‌ర్వాత స‌ర్ధుబాటు ధోర‌ణిలో సాగుతున్నారు. అదంతా కేంద్రంలో త‌న కూతురు క‌విత‌కు మంత్రిప‌ద‌వి కోస‌మేన్న విమ‌ర్శ‌లు లేక‌పోలేవు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా మారుతున్న తెలుగుదేశం పార్టీని తుద ముట్టించేందుకు య‌త్నాలు ప్రారంభించారు.  ఇప్ప‌టికీ అవ‌కాశాలు ఉన్నంత‌వ‌ర‌కు టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేను లాక్కున్న ఆయ‌న రేవంత్ రెడ్డి వంటి నేత‌ల‌ను ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో పొర‌పాటున హోం మంత్రి నాయ‌ని న‌రిసింహారెడ్డి మాట‌ల వ‌ల్ల ఇర‌కాటంలో చిక్కుకున్నారు. వ‌చ్చే జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. పెన్ష‌న్ల మంజూరు, హ‌రిత‌హారం, చెరువుల అభివృద్ధి, హైద‌రాబాద్‌లో విస్తృత పోలీసింగ్ వంటి అంశాల‌లో పేరుతెచ్చుకున్న కేసీఆర్.. మేధావుల మ‌న‌స్సుల‌ను మాత్రం గెలుచుకోలేపోయారు.
మ‌నోవేద‌న‌కు అంతంలేదా?
 ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ధ్య శ‌తాబ్ధాల త‌ర‌బ‌డి ఉన్న ఆత్మీయ‌తా ఆనురాగాల‌ను  రాజ‌కీయ వైషమ్యాలు దెబ్బ‌తీస్తుతున్నాయి. ఫ‌లితంగా ఇరు ప్రాంతాల మ‌ధ్య దూరం పెరిగి బాంధవ్యాల‌కు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇవీ తెలుగుజాతిని క‌ల‌చివేసే ప‌రిణామాలు. వీటిని ప‌రిష్క‌రించే దిశ‌గా ఇరు ప్రాంతాల నాయ‌కులు సంయమ‌నం పాటించాల్సిన అవ‌సరం ఎంతో ఉంది. ఈ ప‌రిస్ధితుల్లో ఇరురాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చొర‌వ అత్యంత అవ‌స‌రంగా క‌నిపిస్తోంది.  సెక్ష‌న్ 8 అమ‌లు అవ‌స‌రం లేనివిధంగా గ‌వ‌ర్న‌ర్ మ‌రింతి క్రియ‌శీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిఉంది.
2 రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షం పూర్‌!
ఆంధ్ర‌, తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌గు రీతిలో వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నాయి. ఆంధ్ర‌లో వైసీపీకి అనుభ‌వ రాహిత్యం వెన్నాడుతోంది. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఎన్నికైన జ‌గ‌న్‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌జా ప్ర‌తినిధిగా క‌నీపం ఐదేళ్ల అనుభ‌వం లేక‌పోవ‌డం, అందులోనూ శాస‌న‌స‌భ‌కు తొలిసారిగా ఎన్నిక‌వ‌డం కూడా కొంతమేర ప్ర‌తికూలమే. ఆయ‌న‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం లేక‌పోవ‌డం, భ‌జ‌న‌బృందాల హోరు కార‌ణంగా ప్ర‌జ‌ల‌లో వైఎస్ఆర్ ప‌ట్ల ఉన్న సానుభూతిని మూట‌గ‌ట్టుకోలేక‌పోయారు. ఈ లోగా అక్ర‌మార్జ‌న కేసుల జోరు, షర్మిల, విజ‌య‌మ్మ‌లు చైత‌న్య‌పూరితంగా లేక‌పోవ‌డం కూడా ప్ర‌జ‌ల దృష్టిలో నిలిచిపోయాయి.ఇక తెలంగాణ‌లో కూడా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ గ‌ట్టిగా పోరాడ‌డంలేదు.ప్ర‌తిప‌క్ష‌నేత జానా రెడ్డి కూడా దాదాపు విఫ‌ల‌మ‌య్యారు. ఆయ‌న చేయాల్సిన‌ ప‌నిని టీడీపీ తీసుకుంది.  నూత‌న నాయ‌క‌త్వం కాంగ్రెస్ ప్రాభ‌వం కోసం కృషి చేస్తుండగా, డిఎస్ వంటి నేత‌ల తీరుతో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.
ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఏడాది కాలంగా చూస్తే మీడియాకు మొండిచేయే మిగిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రెస్ అకాడ‌మీ పున‌రుద్ధ‌ర‌ణ‌, మీడియా సంక్షేమ క‌మిటీ ఏర్పాటు,, అక్రిడిటేష‌న్ల మంజూరు అట‌కెక్కాయి. ఒక్క‌రికీ ఇళ్ల స్ధ‌లం ఇవ్వ‌లేదు. ఆర్టీసీ పాస్‌ల వ్య‌వ‌హారంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌క‌ట‌న‌ల‌కు క‌త్తెర వేశారు. చిన్న‌పత్రిక‌ల మ‌నుగ‌డ క‌ష్ట‌సాధ్యంగా మారింది. పైగా సాక్షి ప‌త్రిక‌, ఛానెల్‌పై అన‌ధికార నిషేధం కొన‌సాగుతోంది. నెల‌లు గ‌డిచినా ఇంకా హెల్త్ కార్డులు పాత్రికేయుల‌కు చేర‌లేదు. ఇక తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్ధితి. త‌న‌కు స‌హ‌క‌రించిన అల్లం నారాయ‌ణ‌కు ప్రెస్ అకాడ‌మీ ప‌ద‌వినిచ్చిన కేసీఆర్  ..పాత్రికేయులకు ఇళ్లు ఇస్తామ‌ని ఆశ చూపారే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లేదు. రెండు రాష్ట్రాల‌లో జ‌ర్న‌లిస్టుల సంక్షేమ నిధి పెంచినా క‌మిటీలు లేక ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. తెలంగాణ‌లో ఆంధ్రజ్యోతి ఛానెల్‌పై నిషేధం కొన‌సాగిస్తున్నారు.జ‌ర్న‌లిస్టుల‌కు ఉత్త‌చేయి చూప‌డంలో ఇరు రాష్ట్రాల సీఎంలు స‌రిజోడుగా నిలిచారు
Attachments

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *