
హైదరాబాద్ : త్వరలోనే 18వేల పోస్టుల భర్తీ చేయనున్నట్టు నిరుద్యోగులకు డీజీపీ అనురాగ్ శర్మ తీపి కబురు చెప్పారు. హైదరాబాద్ లో అధికారాలు తెలంగాణ పోలీస్ శాఖ పరిధిలోనే ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయన్నారు. వాటిలో ఒకటి వరంగల్ లో కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని.. రూ.5.50 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.