త్వరలో సచిన్ పై సినిమా

ముంబై, ప్రతినిధి : సచిన్ మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు. అదేంటి.. సచిన్ రిటైర్ అయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా. మరీ… సిక్సులు..? బౌండరీలేంటనుకుంటున్నారా..? సచిన్ క్రికెట్ ఆడటం నిజమే కానీ.. రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. మాస్టర్ బ్లాస్టర్ లైఫ్ స్టోరీని త్వరలో వెండితెరపై చూడబోతున్నాం.

బాలీవుడ్ లో సచిన్ పై సినిమా తీస్తున్నారు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఈ మూవీలో యాక్ట్ చేసేది కూడా సచినే. ముంబైకి చెందిన 200 నాటౌట్ అనే నిర్మాణ సంస్థ.. సచిన్ లైప్ స్టోరీపై సినిమా తీస్తోంది. 150కి పైగా యాడ్స్, షార్ట్ ఫిలింస్ తీసిన ఈ సంస్థ.. ఇప్పుడు సచిన్ మూవీ తీసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని రైట్స్ ను.. వాల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ నుంచి తీసుకుంది. లండన్ కు చెందిన ఫేమస్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన జేమ్స్ ఎరైస్క్ .. మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

మాస్టర్ బ్లాస్టర్ జీవిత చరిత్రతో పాటు..  క్రికెట్ లైఫ్ లోని కొన్ని కీలక అంశాలతో ఈ మూవీ తీస్తున్నారట. స్క్రిప్ట్ విషయంలో కూడా.. డైరెక్టర్ కు సచిన్ హెల్ప్ చేస్తున్నారట. సో.. త్వరలో మనం సచిన్ క్రికెట్ ను మళ్లీ చూడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.