
హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణలో త్వరలోనే వెయ్యి కోట్లతో గోడౌన్ లు నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన ఈరోజు స్టేట్ క్రెడిట్ సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ లు అవసరమన్నారు. గోడౌన్లు నిర్మించడం వల్ల రైతులకు మంచి మద్దతు ధర దక్కుతుందన్నారు.
మిషన్ కాకతీయ ప్రోగ్రామ్‌కు నాబార్డ్ సహకరించాలని కోరారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలోని 46 వేల చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. ఏడాదికి 9 వేల చెరువులకు జలకళ తెస్తామన్నారు. ఇక రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయం పెంచుతామని తెలిపారు.