త్వరలో ‘ఓదార్పు యాత్ర’

శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టిమణి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘వజ్రం’. ఎస్.డి.రమేష్ సెల్వన్ దర్శకత్వం వహించారు. సాయిరంగా ఫిలింస్ పతాకంపై నిర్మాత కె.రంగారావు ‘ఓదార్పు యాత్ర’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.రంగారావు మాట్లాడుతూ.. “దుర్మార్గులకు అంతిమ యాత్ర, మంచివాళ్లకు ఓదార్పు యాత్ర అనేది చిత్ర ఇతివృత్తం. రాజకీయ నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ కథ ఇది. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కుటుంబమంతా కలసి చూసే సందేశాత్మక చిత్రమిది. వెన్నెలకంటి, మలూరి వెంకట్ చక్కని సంభాషణలు, పాటలు రాశారు.  ప్రేశాకులకు స్ట్రెయిట్ తెలుగు చిత్రం చూస్తున్న భావన కలుగుతుంది. చిత్రంలో రెండు పాటలున్నాయి. రికార్డింగ్ పూర్తయింది. శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టిమణి తమిళంలో నటించిన మూడు చిత్రాలు వందరోజులు వేడుక జరుపుకున్నాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగులో ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెలాఖరున లేదా డిసెంబర్ ప్రారంభంలో చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ”న్నారు. తంబి రామయ్య, జయప్రకాశ్(జెపి), మైలస్వామి, భవానీ రెడ్డి, సనా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఎఆర్.కుమరేసన్, ఎడిటింగ్ : మరిష్, పాటలు – మాటలు : వెన్నెలకంటి, మలూరి వెంకట్, సంగీతం : ఎఫ్.ఎం.ఫైజల్, దర్శకత్వం : ఎస్.డి.రమేష్ సెల్వన్, నిర్మాత : కె.రంగారావు
odarpu2odarpu3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *