త్వరలో అల్లం రాజీనామా.?

-ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి వదులుకోవాలని నిర్ణయం.?

ఉద్యమకారుడు ఉత్సవం విగ్రహంలా మారాడాని వస్తున్న అపవాదు ఒకవైపు.. నవ తెలంగాణలో అనుకున్న లక్ష్యాలను అందుకోలేదనే తలంపు మరోవైపు.. అటు ఎదురించలేక.. ఇటు వచ్చే విమర్శలను తట్టుకోలేక.. పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ..

తెలంగాణ ఉద్యమకారుడిగా.. పత్రికా ఎడిటర్ గా ఆయన తెలంగాణ కోసం గజ్జెకట్టి, గళమెత్తి.. ఆంధ్రా కుట్రలను ఎలుగెత్తి చాటాడు.. తెలంగాణ పోరుబాటలో తాను సైతం కదిలి జైలుకు వెళ్లాడు.. రోడ్డు పై వచ్చి ఆందోళనలు చేశాడు.. అంతటి ఉద్యమకారుడి కల నెరవేరింది.. ఆయనతో కలిసి నడిచిన మనుషులు అధికారం చేపట్టారు. అనుకున్నట్టే అల్లం నారాయణకు ఒక పదవి లభించింది.. కానీ పదవితో ఆయనలో ఉద్యమకారుడు .. ప్రశ్నించేవాడు కూడా చచ్చిపోయాడు..

సీఎం కేసీఆర్ సీఎం అయిన వెంటనే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణను నియమించారు. స్వయనా తెలంగాణను ముందుడి తీరాలకు చేర్చిన కేసీఆర్ పిలిచేసరికి అల్లం నో చెప్పకుండా ఆ పదవిని అలంకరించారు. అక్కడ వరకు ఓకే.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..

పదవిలో ఉండగా.. ఆయన తెలంగాణ కోసం చేసిన హామీలు నెరవేర్చలేదు.. కేసీఆర్ కు విన్నవిస్తే పునర్నిర్మాణంలో జర్నలిస్టుల సమస్యలు వాయిదాల మీదా వాయిదాలు వేస్తూ వచ్చారు. దీంతో అటు జర్నలిస్టులకు ముఖం చూపించలేక.. ఇటు కేసీఆర్ ను ఎదురించలేక నరకయాతన అనుభవిస్తున్నారు అల్లం నారాయణ.. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ చేత జర్నలిస్టులకు హెల్త్ కార్డులపై సంతకం పెట్టించారు. జీవో కూడా ఇప్పించారు. కానీ ఇంతవరకు దాన్ని అమలుచేయలేదు.. దీంతో జిల్లాల్లో మరో సారి జర్నలిస్టుల మందు నవ్వుల పాలయ్యారు.

ఇదంతా ఆయనలోని ఉద్యమకారుడిని మళ్లీ నిద్రలేపుతోంది.. ప్రశ్నించే గొంతుకనే ప్రశ్నిస్తుంటే ఆక్రోశం పట్టలేక.. పదవి వదులుకునేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే అల్లం నారాయణ ప్రెస్ అకాడమీకి రాజీనామా చేయబోతున్నారని సమాచారం..

కొసమెరుపు..

అల్లం నారాయణ రాజీనామా వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయలేకపోతున్నానన్న బాధ.. మరొకటి తన జీవిత సర్వస్యం అయిన జర్నలిజంలోకి అడుపెట్టి మళ్లీ రాయలనే ఆకాంక్ష ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని వదులుకునేందుకు దారీతీస్తున్నాయి.. త్వరలోనే నమస్తే తెలంగాణ మాజీ చైర్మన్ సీఎల్ రాజం (ప్రస్తుతం బీజేపీలో చేరారు) కొత్త పత్రికను తీసుకొస్తున్నారట.. అందులో అల్లం నారాయణనే ఎడిటర్ గా తీసుకున్నట్టు సమాచారం. అందుకే అల్లం ప్రెస్ అకాడమీకి రాజీనామా చేస్తున్నారని తెలిసింది. తనకిష్టమైన జర్నలిజంలోకి మళ్లీ అడుగుపెట్టి తన కలానికి పదును పెట్టాలనుకుంటున్నారట.. సో వెల్ కం అల్లం నారాయణ గారూ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.