త్రి గార్జేస్ డ్యాం ని సందర్శించిన తెలంగాణా బృందం

త్రి గార్జేస్ డ్యాం ని సందర్శించిన తెలంగాణా బృందం

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్షన కారణంగా డ్యాం పైకి వెళ్ళలేకపోయినా బృందం

బుధవారం  యి చాంగ్ నగరానికి దగ్గరలో ఉన్న త్రి గార్జేస్ డ్యాం ని సందర్శించడానికి తెలంగాణా బృందం బయలుదేరింది. ఇదే రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా డ్యాం సందర్శనకు వస్తున్న కారణంగా డ్యాం  పరిసర ప్రాంతాలన్నీ భద్రత దళాల అధిీనంలో కి తీసుకున్నారు. డ్యాం పైకి , త్రి గార్జేస్ మ్యుసియం సందర్శనకు  అనుమతించలేదు. అయితే డ్యాం వెనుక వైపున సందర్శకులను అనుమతించడంతో మరో మార్గంలో డ్యాం వెనుక ప్రాంతానికి వెళ్లి  డ్యాం అందాలను వీక్షించడం జరిగిందని ఇంజనీర ఇన్ చీఫ్ అనిల్ కుమార్  తెలిపారు. త్రి గార్జేస్ డ్యాం ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. 22,50 0 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు  చైనా మొత్తం  విద్యుత్ వినియోగంలో 5 % ఈ ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతున్నదని లిఫ్ట్ ల సలహాదారు పెంటా రెడ్డి తెలిపారు. 1994 లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2008 నాటికీ పూర్తీ అయ్యింది. డ్యాం లో మొత్తం 1400 tmc నీరు నిల్వ  ఉంటుందని , జలాశయం 600 కి మీ పొడవు ఉంటుందని పేర్కొన్నారు. ఈ డ్యాం నిర్మాణం వలన 13 లక్షల మంది నిర్వాసితులయినారని , 1600 గ్రామాలు , 140 పట్టణాలు మినిగిపోయాయని ఆయన తెలిపినారు. నిర్వాసితులందరికీ అద్భుతమైన సహాయ పునరావాస కార్యక్రమాలను ప్రాజెక్టు తో పాటే పూర్తీ చేసినారని ఆయన అన్నారు. నిర్వాసితుల కోసం కొత్త నగరాలనే నిర్మించారని అన్నారు.  ప్రాజెక్టు నిర్మాణానికి 37 బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారని , ఈ ఖర్చు  అంతా ప్రాజెక్టు పూర్తీ అయిన రెండు సంవత్సరాలకే వసూలు చేసి పెట్టిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి , టూరిజం , నౌకాయానం , చేపల పెంపకం, వరద నియంత్రణ ,  ఇతర మార్గాల ద్వారా ఈ డ్యాం కి పెట్టిన ఖర్చు వసూలు అయ్యిందని పెంటా రెడ్డి తెలిపినారు. సంవత్సరానికి 31 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగం ఈ డ్యాం ఉత్పత్తి చేసే విద్యుత్ కారణంగా తగ్గిపోయిందని , 100 మిలియన్ టన్నుల గ్రీన్ హౌజ్ వాయువుల ఉత్పత్తి తగ్గిపోయిందని, ఒక మిలియన్ టన్నుల సల్ఫర్ డై ఆక్సైడ్ , 3,70,౦౦౦ టన్నుల నైట్రిక్ ఆసిడ్ , ఒక మిలియన్ టన్నుల ధూళి కణాలు వాతావరణంలోకి పోవడం తగ్గిందని ఆయన తెలిపినారు.

ఈ డ్యాం లాంటివి ప్రపంచంలో అతి అరుదుగా నిర్మాణం అవుతాయని , ఇటువంటి నిర్మాణాలకు రాజకీయ పరమైన నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఓ ఎస్ డి శ్రీధర్ రావు అన్నారు.  కాళేశ్వరం పూర్తీ అవుతే త్రి గార్జేస్ డ్యాం చైనా ఆర్ధిక ప్రగతికి కారణం అయ్యిందో అటువంటి ఫలితాలనే తెలంగాణాకు అందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు. ఈ అద్భత కట్టడాన్ని చూడడం పట్ల బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినారు. డ్యాం ని సందర్శించిన వారిలో జెన్కో ఇంజనీర్ వాసుదేవ్ , నవయుగ ప్రతినిధి మల్లినాత్ , ఎస్ ఎ సి కంపనీ ప్రతినిధులు ఉన్నారు.

telangana brundam 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *