త్రాగునీటి పైపులైన్లు, 1.5 మీటర్ల లోతు నుండి వేయాలి: మంత్రి ఈటెల

కకరీంనగర్: మిషన్ భగీరధ పధకం క్రింద జిల్లాలో వేస్తున్న త్రాగునీటి పైపు లైన్లు భూమికి 1.5 మీటర్ల లోతు నుండి వేయాలని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఉదయం స్ధానిక రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా కలెక్టర్, శాసన సభ్యులతో కలిసి సంబంధిత అధికారులతో అధికారులతో మిషన్ భగీరధ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో త్రాగునీటి పైపులైన్లు వేస్తుందని అవి 50-60 సంవత్సరాలు మన్నికగా ఉండేందుకు వాటిపై నుండి ఎన్ని టన్నుల బరువుతో లారీలు వెళ్ళిన పగిలి పోకుండా ఉండేందుకు లోతు నుండి పైపులు వేయాలని సూచించారు. రోడ్ల మధ్య నుండి వాటర్ పైపులు వేయకూడదని అన్నారు. రోడ్డు క్రాసింగ్ ల వద్ద పైపు లైన్లు వేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో గల వాటర్ ట్యాంకులను పరిశీలించి పాతవి, లీకేజీలు ఉన్న ట్యాంకుల స్ధానంలో కొత్త ట్యాంకులు నిర్మించాలని అన్నారు. వాటర్ పైపుల తయారి కేంద్రాలలో పైపుల  మందం నాణ్యత ప్రమాణాలపై ప్రతి రోజు మిషన్ భగీరధ ఇంజనీర్లు తనిఖీలు చేయాలని, పర్యవేక్షించాలని అన్నారు. పంచాయితీ రాజ్, రోడ్డు భవనాలు, మిషన్ భగీరధ ఇంజనీర్లు జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించుటకు ముందు సమన్వయంతో చర్చించుకొని భవిష్యత్తులో ప్రస్తుతం వేసిన రోడ్లు, పైపులైన్లు తొలగించకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొత్త రోడ్లు వేస్తే ముందు ఆర్ బ్ల్యూఎస్ అధికారులను సంప్రదించాలని అన్నారు. గ్రామాలలో ఉన్న పాత సిమెంటు త్రాగు నీటి పైపులను తొలగించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 100 మీటర్లకు ఒకటి చొప్పున రోడ్డు క్రింద పెద్ద పైపులను వేయాలని, దాని ద్వారా రైతులు సాగునీటి పైపులు వేసుకొంటారని తెలిపారు. రైతులు రోడ్లను కట్ చేయరని అన్నారు. మిషన్ భగీరధ పనులను చాలా పర్పెక్టు చేయాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, శాసన సభ్యులు గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, వాటర్ గ్రిడ్ ఎస్ఇ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ సతీష్ కుమార్ ఇఇ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.