Breaking News

త్రాగునీటి పథకాల అమలు వేగవంత చేయ్యండి

RTN_5547

మున్సిపాలిటిలలో ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి పథకం క్రింద చేపడుతున్న సమగ్ర తాగునీటి పథకాల అమలు వేగవంతం చేయ్యాలని అధికారులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్ ఆదేశించారు.

సోమవారం మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో మున్సిపల్ , మెప్మా, టవున్ ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ, త్రాగునీటి పథకాల పనులను జాప్యం లేకుండా నిర్ణిత గడువులోగా పూర్తి చేయ్యాలని అన్నారు. సంబంధిత అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయ్యాలని అన్నారు. అర్బన్ లోకల్ బాడిలలో ఇ-గవర్నెస్ ప్రాజెక్టు అమలు తీరుతెన్నులపై అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. పట్టణాలలో , స్ట్రీట్ వెండర్స్ పై వెంటనే సర్వేను పూర్తి చేసి నివేదికలను అందించాలని అన్నారు. తెలంగాణ అర్బన్ ప్లానింగ్ సర్విస్ స్ పై అధికారులతో చర్చించారు. పట్టణాలలో అమలుఅవుతున్న పౌరసేవలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ కమీషనర్ టి.కె.శ్రీదేవి, పట్టణా మరియు గ్రామీణ ప్రణాళిక శాఖ డైరెక్టర్ అనంద్ బాబు, ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ధనసింగ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *